
చెన్నై : ‘నా కుమార్తె హీరోయిన్’గా మారుతోందా..అబ్బే లేదండీ.. అది ఇంకా చిన్నపిల్ల.. అలాంటిది ఏదైనా ఉంటే నేనే చెబుతాగా అంటున్నారు ప్రముఖ సినీ నటి వాణీ విశ్వనాథ్. పిల్లల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా తల్లిదండ్రులు నడుచుకోవాలనేది నా సిద్ధాంతం. నా కుమార్తె ఆర్చా ప్రస్తుతం ప్లస్‌వన్ చదువుతూ డాక్టర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ మధ్యలో తన మనసు మార్చుకుని నటిగా మారాలని భావిస్తే ఆ సంగతి నేనే సగర్వంగా ప్రకటిస్తాను కదా.
అయితే వాణి విశ్వనాథ్ కుమార్తె నటిగా రంగప్రవేశం చేస్తోదంటూ ఇటీవల ప్రచారంలోకి వచ్చిన వర్ష...వాస్తవానికి స్వయానా నా సోదరి శ్రీప్రియ కూతురు. వర్ష నా కుమార్తే అనుకుని అభిమానంతో ఎందరో నాకు ఫోన్లు చేస్తున్నారు. వారందరికీ ధన్యవాదాలు. వర్ష కూడా నా కుమార్తెతో సమానమే. అందుకే నటిగా ఆమె ఉజ్వలమైన భవిష్యత్తును సొంతం చేసుకోవాలని, అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నానని చెప్పారు వాణి విశ్వనాథ్.
Comments
Please login to add a commentAdd a comment