Decision To Withdrawal Of Rs 2000 Notes Part Of Currency Management, Says RBI Governor - Sakshi
Sakshi News home page

Rs 2000 Note Withdrawn: రూ.2 వేల నోట్ల ఉపసంహరణపై ఆర్బీఐ గవర్నర్‌ స్పష్టత.. కీలక విషయాలు వెల్లడి

Published Mon, May 22 2023 12:22 PM | Last Updated on Mon, May 22 2023 2:00 PM

Withdrawal of rs 2000 notes part of currency management RBI Governor - Sakshi

భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ రూ. 2 వేల నోట్లు ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మొట్టమొదటిగా స్పందించారు. రూ.2 వేల నోట్ల ఉపసంహరణను కరెన్సీ నిర్వహణలో భాగంగా తీసుకున్న కీలక చర్యగా అభివర్ణించారు.

కేంద్ర బ్యాంకులకు సంబంధించిన ఓ అంతర్గత కార్యక్రమంలో పాల్గొన్న శక్తికాంతదాస్‌ మీడియాతో మాట్లాడారు. రూ.2 వేల నోట్ల ఉపసంహరణకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు. నోట్ల ఉపసంహరణ అనేది ఆర్బీఐ సాధారణంగా చేపట్టే కరెన్సీ మేనేజ్‌మెంట్‌ చర్యల్లో భాగమేనని, క్లీన్‌ నోట్‌ పాలసీ అన్నది ఆర్బీఐ ఎప్పటినుంచే అమలుచేస్తోందని వివరించారు.

వివిధ డినామినేషన్‌ నోట్లలో కొన్ని సిరీస్‌లను ఆర్బీఐ అప్పుడప్పుడూ ఉపసంహరిస్తుందని, కొత్త సిరీస్‌లను విడుదల చేస్తుందని చెప్పారు. అలాగే రూ.2 వేల నోట్లను కూడా ఉపసంహరించినట్లు తెలిపారు. అయితే అవి చెల్లుబాటు అవుతాయని వివరించారు.

మరోవైపు రూ.2 నోటును ఎందుకు తీసుకొచ్చారో వెల్లడించారు. గతంలో రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేసినప్పుడు ఏర్పడిన నగదు కొరతను నివారించడానికి రూ.2000 నోట్లను ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ఇప్పుడు ఆ లక్ష్యం నెరవేరిందని వివరించారు. రూ.2 వేల నోట్ల జారీని చాలా రోజుల క్రితమే ఆపేసినట్లు స్పష్టం చేశారు.

రూ.2 వేల నోట్ల మార్పిడి, డిపాజిట్‌ కోసం తగినంత సమయం ఇచ్చామని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని సూచించారు. సెప్టెంబర్‌ 30 వరకూ రూ.2 వేల  నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయవచ్చన్నారు. కాగా డిపాజిట్‌ మొత్తం రూ.50 వేలకు మించితే పాన్‌ కార్డ్‌ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. నగదు డిపాజిట్‌కు సంబంధించి ఈ నిబంధన ఎప్పటి నుంచో ఉందని గుర్తు చేశారు.

ఇదీ చదవండి: Rs 2,000 Notes: బంగారం కొంటాం.. రూ.2 వేల నోట్లు తీసుకుంటారా? జువెలరీ షాపులకు వెల్లువెత్తిన ఎంక్వైరీలు!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement