వాషింగ్టన్: భారత్ కు న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్(ఎన్ఎస్ జీ) లో స్థానం కల్పించడం పట్ల అమెరికా పాకిస్తాన్ కు వివరణ ఇచ్చింది. భారత్ కు అమెరికా మద్దతు తెలపడం కేవలం ఆయుధాల అమ్మకానికి సంబంధించింది కాదనీ, ప్రపంచంలోని న్యూక్లియర్ టెక్నాలజీని శాంతియుతంగా వినియోగించేందుకేననీ.. ఈ విషయాన్ని పాకిస్తాన్ అర్ధం చేసుకుంటే బాగుంటుందని శుక్రవారం అమెరికా డిప్యూటీ ప్రతినిధి మార్క్ టోనర్ తెలిపారు.
భారత్ కు గ్రూప్ లో స్థానాన్ని కల్సించడంపై మాట్లాడిన ఆయన మొత్తం 48 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్న ఎన్ఎస్ జీ లో ఓటింగ్ తర్వాత భారత్ సభ్యత్వంపై క్లారిటీ వస్తుందని వివరించారు. న్యూక్లియర్ సప్లై గ్రూప్ లో కొత్తగా సభ్యులను చేర్చుకోవడమా? లేదా? అన్నది వారి ఇష్టమని ఈ విషయంపై ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేని తెలిపారు. త్వరలో జరగనున్న ఎన్ఎస్ జీ సమావేశాలు నూతన సభ్యత్వాలకు సంబంధించినవి కావని వివరించారు. పాకిస్తాన్ తన ఇష్టాన్ని బహిర్గతం చేసుకుందనీ ఎన్ఎస్ జీ లో సభ్యత్వం కోసం ఏ దేశమైనా దరఖాస్తు చేసుకోవచ్చని నిర్ణయం సభ్యుల మధ్య ఏకాభిప్రాయం పై ఆధారపడి ఉంటుంది.