inactive
-
పనిచేయని పాన్ కార్డులపై ఐటీ శాఖ క్లారిఫికేషన్
ఆధార్ కార్డ్‌తో లింక్ చేయని కారణంగా పనిచేయకుండా పోయిన (ఇనాపరేటివ్) పాన్ కార్డులు, ఇతర కారణాలతో ఇన్‌యాక్టివ్‌గా మారిన పాన్ కార్డులు రెండూ ఒకటి కావు. ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైలింగ్ సందర్భంగా ఇనాపరేటివ్, ఇనాక్టివ్ పాన్ కార్డుల మధ్య తేడా తెలియక తికమక పడుతున్న ప్రజలకు ఆదాయపు పన్ను శాఖ క్లారిఫికేషన్ ఇచ్చింది. ‘పనిచేయని (ఇనాపరేటివ్) పాన్ కార్డు, ఇన్‌యాక్టివ్ పాన్ కార్డు రెండూ వేరు వేరు. పాన్ కార్డు పనిచేయక పోయినా ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయవచ్చు’ అని ఐటీ శాఖ ట్విటర్లో పోస్టు ద్వారా తెలియజేసింది. అయితే పనిచేయని పాన్లకు పెండింగ్‌లో ఉన్న రీఫండ్లు, వాటి మీద వడ్డీలు చెల్లింపులు సాధ్యం కావని స్పష్టం చేసింది. ఇదీ చదవండి ➤ Inoperative PAN: పాన్ కార్డ్ పనిచేయడం లేదా..? అయితే ఈ లావాదేవీలు చేయలేరు! అలాగే ఇనాపరేటివ్ పాన్ ఉన్నవారికి టీడీస్ (ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్), టీసీఎస్ (ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్) లను అధిక రేటుతో విధించనున్నట్లు పేర్కొంది. కాగా ఆధార్ కార్డుతో పాన్ కార్డ్ లింక్ చేయడానికి గడువు జూన్ 30తో ముగిసింది. ఎన్ఆర్ఐ పాన్లపై స్పష్టత ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయులు తమ పాన్ ఇన్ఆపరేటివ్గా (పనిచేయకపోతే) మారిపోతే, నివాస ధ్రువీకరణ పత్రాలతో అసెసింగ్ అధికారులను సంప్రదించాలని ఆదాయపన్ను శాఖ సూచించింది. తమ పాన్లు పనిచేయకుండా పోవడం పట్ల కొందరు ఎన్ఆర్ఐలు, విదేశీ పౌరసత్వం కలిగిన భారతీయుల (ఓసీఐలు) నుంచి ఆందోళన వ్యక్తమైనట్టు తెలిపింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో ఐటీఆర్ దాఖలు చేసిన వారి స్టేటస్ వివరాలను తామే జురిస్డిక్షనల్ అసెసింగ్ ఆఫీసర్లకు పంపించినట్టు స్పష్టం చేసింది. గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో రిటర్నులు దాఖలు చేయని లేదా తమ నివాస హోదాను అప్డేట్ చేయని వారి పాన్లు పనిచేయకుండా పోయినట్టు ఆదాయపన్ను శాఖ తెలిపింది. Dear Taxpayers, Concerns have been raised by certain NRIs/ OCIs regarding their PANs becoming inoperative, although they are exempted from linking their PAN with Aadhaar. Further, PAN holders, whose PANs have been rendered inoperative due to non-linking of PAN with Aadhaar,… — Income Tax India (@IncomeTaxIndia) July 18, 2023 -
మస్క్ షాకింగ్ డెసిషన్:150 కోట్ల ట్విటర్ యూజర్లకు మంగళం!
న్యూఢిల్లీ: మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ట్విటర్ కొత్త బాస్, టెస్లా సీఈవో, ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ యూజర్లకు షాకింగ్ న్యూస్ చెప్పారు. దాదాపు 1.5 బిలియన్ల ఇన్‌యాక్టివ్ ఖాతాలను తొలగిస్తోంది. 1.5 బిలియన్ ఖాతాల నేమ్ స్పేస్‌ను ఖాళీ చేయడం1.5 బిలియన్ ఖాతాల నేమ్ స్పేస్‌ను ఖాళీ చేస్తున్నానంటూ మస్క్ శుక్రవారం ట్వీట్ చేశారు. (108 ఎంపీ కెమెరాతో అదిరిపోయే 5జీ స్మార్ట్‌ఫోన్, ఫస్ట్ సేల్ ఆఫర్ కూడా!) ప్లాట్‌ఫారమ్‌లో సంవత్సరాలుగా చురుగ్గా లేకుండా, ఎలాంటి ట్వీట్స్ లేకుండా, కనీసం లాగిన్ కూడా కాని 1.5 బిలియన్ ఖాతాల పేర్లను తొలగించనున్నట్టు తేల్చి చెప్పారు. అంతేకాదు యూజర్ అకౌంట్ స్టేటస్‌ను తెలిపే సాఫ్ట్వేర్ అప్డేట్పై తాము పనిచేస్తున్నామన్నారు. దీని ద్వారా తమ ట్వీట్లు "షాడో బ్యానింగ్" ఎందుకు ఎలా అయిందో, ఎలా అప్పీల్ చేయాలో వినియోగదారులకు తెలుస్తుందన్నారు. (భారత్‌పే కో-ఫౌండర్, మాజీ ఎండీకి భారీ షాక్!) Twitter will soon start freeing the name space of 1.5 billion accounts — Elon Musk (@elonmusk) December 9, 2022 "ట్విట్టర్ ఫైల్స్ 2" లో సంచలన విషయాలను వెల్లడించింది. అలాగే ఒక రహస్య టీం ఆధ్వర్యంలో అప్పటి సీఈవో జాక్ డోర్సీ సెలబ్రిటీలకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే షాడో బ్యానింగ్ లాంటి వివాదాస్పద నిర్ణయాలను తీసుకుందని ఆరోపించింది. ఈ సీక్రెట్ గ్రూప్‌లో లీగల్, పాలసీ అండ్ ట్రస్ట్ హెడ్ (విజయ గద్దే), గ్లోబల్ హెడ్ ఆఫ్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ (యోయెల్ రోత్), మాజీ జాక్ డోర్సే, పరాగ్ అగర్వాల్ ఇతరులు ఉన్నారని ది ఫ్రీ ప్రెస్ ఫౌండర్, ఎడిటర్ బారీ వీస్ చెప్పారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5051504145.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మీరు వినియోగించని బ్యాంక్ అకౌంట్లలో ఎంత సొమ్ము మగ్గుతుందో తెలుసా?
సహకార బ్యాంకులు సహా బ్యాంకింగ్ వ్యవస్థలో వినియోగంలో లేని ఖాతాల్లో ఉన్న మొత్తం రూ.26,697 కోట్లని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. రాజ్యసభలో ఈ మేరకు అడిగిన ఒక ప్రశ్నకు సీతారామన్ సమాధానం చెబుతూ, 2020 డిసెంబర్ 31వ తేదీ నాటికి దాదాపు తొమ్మిది కోట్ల అకౌంట్లలో ఈ భారీ మొత్తాలు ఉన్నట్లు వివరించారు. ఈ అకౌంట్లు దాదాపు పదేళ్ల నుంచీ నిర్వహణలో లేవని తెలిపారు. ఆమె తెలిపిన సమాచారం ప్రకారం, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల్లో 8,13,34,849 అకౌంట్లలో రూ.24,356 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో (యూసీబీ)ల్లోని 77,03,819 అకౌంట్లలో రూ.2,341 కోట్ల డబ్బు ఉంది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లోని 64 అకౌంట్లలో ఉన్న సొమ్ము రూ.0.71 కోట్లు. కాగా ఈ అకౌంట్లకు సంబంధించి ఖాతాదారులు లేదా వారసులను వెతికి పట్టుకోడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించడానికి బ్యాంకులకు తగిన సూచనలు ఇవ్వడం జరిగిందని ఆర్థికమంత్రి తెలిపారు. నిర్వహణ లేకుండా రెండేళ్లు పైబడితేనే ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించడం జరిగిందని తెలిపారు. ఇలాంటి జాబితాను బ్యాంకుల నోటీస్ బోర్డ్‌ల్లో ఉంచాలని కూడా బ్యాంకులకు నిర్దేశించడం జరిగిందన్నారు. అలాగే వినియోగంలో లేని ఖాతాల్లో డబ్బును డిపాజిటర్ల విద్య, అవగాహనా ఫండ్ స్కీమ్, 2014కు బదలాయించి నిధిని సద్వినియోగ పరిచే చర్యలూ అమల్లో ఉన్నట్లు తెలిపారు. ఆర్బీఐ మాస్టర్ సర్క్యులర్ ప్రకారం, ప్రతి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ బోర్డు (హెచ్ఎఫ్సి) తన నిధుల వ్యయం, మార్జిన్, రిస్క్ ప్రీమియం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని వడ్డీ రేటు నమూనాను అవలంబించవచ్చని మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి తెలిపారు. చదవండి: దూసుకెళ్తున్న జీఎస్టీ వసూళ్లు! -
ఆ ఎస్బీఐ డెబిట్ కార్డ్‌లు ఇక పనిచేయవు!
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డులను ఈఎంవీ చిప్ కార్డులతో మార్చుకోవాలని సూచిస్తోంది. కస్టమర్ల వద్ద ఉన్న పాత కార్డులు డిసెంబర్ 31 తరువాత పనిచేయవని తెలిపింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం కార్డులను రీప్లేస్ చేసినట్టు వివరించింది. మాగ్నటిక్ స్టిప్ కార్డులతో మోసాలు జరుగుతుండడంతో వాటిని అరికట్టే ప్రయత్నంలో ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2016లో అప్పటికి వినియోగంలో ఉన్న మాగ్నటిక్ స్టిప్ డెబిట్ కార్డుల స్థానంలో ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులను ఆర్బీఐ ప్రవేశ పెట్టింది . ఇప్పటికీ కూడా కొత్త ఈఎంవీ చిప్ కార్డు పొందని కస్టమర్లకు వెంటనే బ్యాంక్‌కు వెళ్లి కార్డును మార్చుకోవాలని కస్టమర్లకు సూచించింది. చదవండి: ఎస్బీఐ గుడ్‌న్యూస్ మ్యాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డును మార్చుకోవడానికి కస్టమర్లు ఆయా బ్రాంచ్‌లకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఎస్బీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో ట్వీట్ కూడా చేసింది. కొత్త ఈఎంవీ చిప్, పిన్ ఆధారిత ఎస్బీఐ డెబిట్ కార్డు తీసుకోవాలని తెలిపింది. ఈ కార్డుల వల్ల ఎన్నో మోసాలు జరుగుతున్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మాగ్నటిక్ స్టిప్ కార్డులు మార్చుకోవాలని ఇప్పటికే ఎన్నో సార్లు సూచించడం జరిగిందని, కార్డులను మార్చుకోని వారికి ఇక ఈనెల 31 వరకు మాత్రమేనని పేర్కొంది. -
లాగిన్ కాకుంటే ఆ ఖాతాలు తొలగిస్తాం
శాన్ఫ్రాన్సిస్కో: మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విటర్.. యాక్టివ్‌గా లేని తన ఖాతాదారులకు వార్నింగ్ ఈ-మెయిల్స్ పంపుతోంది. ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలంపాటు ట్విటర్ అకౌంట్ లాగిన్ చేయకుండా నిద్రాణవ్యవస్థలో(ఇన్‌యాక్టివ్) ఉన్న యూజర్‌నేమ్‌తో పాటు ఖాతాలను పూర్తిగా తొలగిస్తామని పేర్కొంది. అలా జరగకుండా ఉండాలంటే డిసెంబరు 11లోగా లాగిన్ అవ్వాలంటూ వినియోగదారులను ట్విటర్ హెచ్చరించింది. వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడంతో పాటు విశ్వసనీయ సమాచారం, కచ్చితత్వం కొరకు మాత్రమే తాము నిద్రావస్థలో ఉన్న ట్విటర్ అకౌంట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేశామని తెలిపింది. అయితే తాము ఒక్కసారిగా ఇన్‌యాక్టివ్ ట్విటర్ అకౌంట్లను తొలగించమని, తొలగింపు ప్రక్రియకు కొన్ని నెలల సమయం పడుతుందని ఈ మేరకు ట్విటర్ అధికార ప్రతినిధి చెప్పుకొచ్చారు. ట్విటర్ కస్టమర్లు యాక్టివ్‌గా ఉన్నంతవరకు వారి ఖాతా సేఫ్‌గా ఉంటాయని వివరించారు. ట్విటర్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో ట్విటర్ ఖాతాను మరిచినవారితో పాటు చనిపోయిన ఖాతాదారుల అకౌంట్లపై ప్రభావం కనిపించనుంది. -
ట్విటర్‌కు గుడ్‌బై, రెడ్‌ఇట్‌కు ప్రశంసలు
శాన్ ఫ్రాన్సిస్కో : మల్టీ-బిలియనీర్, టెక్ మొగల్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను సోషల్‌మీడియా ఖాతా ట్విటర్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. తద్వారా 29 మిలియన్ల ట్విటర్ ఫాలోయర్లకు ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌లో తన ట్విటర్ అకౌంట్‌ను డిలీట్ చేస్తానని చెప్పడం ఇదిరెండవసారి. అయితే అప్పట్లో ఖాతాను తొలగిస్తానని చెప్పినప్పటికీ, అకౌంట్ యాక్టివ్‌గా ఉండటం విశేషం. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ గురించి ఖచ్చితంగా తెలియదు కానీ, రెడ్ఇట్ బావుందంటూ వరుస పోస్ట్‌లలో వ్యాఖ్యానించారు. కాగా టెస్లా సీఈఓ అధికారిక రెడ్ఇట్ ఖాతా చాలా సంవత్సరాలుగా యాక్టివ్‌గా లేదు. అయితే ఈ పోస్ట్‌ల తర్వాత మస్క్ ట్విటర్ ఖాతా ఇప్పటికీ చురుకుగా వుండటం ఆసక్తికరం. కాగా గత ఏడాది బ్రిటీష్ గజ ఈతగాడు వెర్నాన్ అన్స్వర్త్పై ఎలాన్ మస్క్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదానికి తీసాయి. థాయ్ గుహలో చిక్కుకుపోయిన 12 మంది బాలలు, సాకర్ కోచ్ రక్షణలో కీలక పాత్ర పోషించిన వెర్నాన్‌ను 'పేడో గై' అని పిలిచినందుకు వచ్చేనెలలో విచారణను ఎదుర్కోన్నారు. 57 వేల పౌండ్ల పరువు నష్టం దావా అతనిపై దాఖలైన సంగతి తెలిసిందే. అంతకుముందు, తన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా గురించి తప్పుదోవపట్టించే కార్పొరేట్ సమాచారాన్ని అందించారంటూ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆరోపణలు చేసింది. ఫలితంగా 20 మిలియన్ల జరిమానాను మస్క్ చెల్లించవలసి వచ్చింది. Going offline — Elon Musk (@elonmusk) November 1, 2019 Reddit still seems good — Elon Musk (@elonmusk) November 1, 2019 Not sure about good of Twitter — Elon Musk (@elonmusk) November 1, 2019 -
కార్డులు.. చిక్కులు!
రేషన్‌కార్డుల ఇన్ యాక్టివ్‌తో అవస్థలు - యాక్టివ్‌లోకి తెచ్చుకునేందుకు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ - సరుకులతో పాటు ప్రభుత్వ పథకాలకు దూరం - ఏడాదిగా కొందరి అవస్థలు వర్ణనాతీతం - పింఛన్లు రద్దు కావడంతో అధికారుల కాళ్లావేళ్లా.. కర్నూలు(అగ్రికల్చర్): రేషన్ కార్డు లబ్ధిదారులను కొత్త సమస్య ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కార్డులు ఇన్ యాక్టివ్ అవుతుండటంతో దిక్కుతోచని స్థితి ఎదురవుతోంది. వీటి సంఖ్య ఒకటి, రెండు కాదు.. వందలు, వేలల్లో ఉంటోంది. రేషన్ కార్డు యాక్టివ్‌లో ఉంటేనే సరుకులు అందుతాయి. పింఛన్లతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయి. కార్డు ఇన్ యాక్టివ్‌లో పడిపోతే ఎలాంటి ప్రయోజనాలు పొందే అవకాశం ఉండదు. జీవనాధారం అయిన రేషన్ కార్డులు ఇన్‌యాక్టివ్‌లో పడి నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా యాక్టివ్ చేయడానికి అధికారులకు మనసొప్పని పరిస్థితి. తహసీల్దారు, ఏఎస్ఓ ఆఫీసులు, జిల్లా కేంద్రంలోని డీఎస్ఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఫలితం లేకపోతోంది. జిల్లాలో 10.76 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. నాలుగవ విడత జన్మభూమి సందర్భంగా జిల్లాకు కొత్తగా 87వేల రేషన్ కార్డులు మంజూరయ్యాయి. అయితే ఇటీవలి వరకు యాక్టివ్‌లో ఉన్న కార్డులు ఉన్నట్లుండి ఇన్ యాక్టివ్‌లోకి వెళ్తుండటం పట్ల లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రేషన్ కార్డులు ఇన్ యాక్టివ్‌లోకి ఎందుకు వెళ్తాయంటే.. రేషన్ కార్డు నెంబర్‌తో కుటుంబ యజమానితో పాటు ఎంత మంది సభ్యులు ఉంటే అంత మంది ఆధార్ నెంబర్లు అనుసంధానం కావాల్సి ఉంది. ఆధార్ అనుసందానం కాకపోతే కార్డులు ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్తాయి. ఒక మండలానికి చెందిన ఆధార్ కార్డులు మరో మండలానికి చెందిన కార్డులతో లింకప్ అయ్యాయి. జిల్లాకు చెందిన వందలాది మంది ఆధార్ నెంబర్లు అనంతపురం జిల్లాలోని కార్డులతో అనుసందానమయ్యాయి. ఇలాంటివన్నీ చెల్లని కార్డులుగా మారాయి. ఆధార్ నెంబర్లు తప్పుగా ఉన్నప్పుడు వేలి ముద్రలు సరిపోవు. అలాంటప్పుడు కూడా కార్డులు పనిచేయవు. రేషన్ కార్డుతో ఆధార్ నెంబర్లు, సెల్‌ఫోన్ నెంబరు కూడా అనుసంధానం కావాల్సి ఉంది. ఇలా అనేక కారణాల వల్ల రేషన్ కార్డులు పనిచేయకుండా పోతున్నాయి. కొన్ని సందర్భాల్లో అన్నీ సక్రమంగా ఉన్నా కార్డులు ఇన్ యాక్టివ్ అవుతున్నాయి. ప్రతి నెల ఇన్ యాక్టివ్‌లోకి వెళ్లె కార్డులు 500 నుంచి 1000 వరకు ఉంటున్నాయి. యాక్టివ్‌లోకి తెచ్చుకోవాలంటే.. పనిచేయని రేషన్ కార్డులను తిరిగి పనిచేసేలా చేసుకోవాలంటే కార్డుదారులకు తల ప్రాణం తోకకు వస్తోంది. జిల్లా వాసుల ఆధార్ నెంబర్లు అనంతపురం జిల్లా రేషన్ కార్డులతో అనుసంధానం అయినవి అనేకం ఉన్నాయి. అక్కడ తొలగించుకోలేకపోతే ఇక్కడ కార్డు లేదా సభ్యుడు యాక్టివ్‌లోకి వచ్చే అవకాశం లేదు. కొందరు అనంతపురం వెళ్లి అక్కడి రేషన్ కార్డులో పేరు తీసివేయించుకొని ఇక్కడికి వచ్చి పేరు యాక్టివ్‌లోకి తెచ్చుకుంటున్నారు. అక్కడ తొలగిస్తేనే ఇక్కడ మళ్లీ రేషన్ కార్డులో సభ్యులుగా చేరేందుకు అవకాశం ఉంది. ఆధార్ అనుసంధానం అయి ఉన్నప్పటికీ కార్డు ఇన్ యాక్టివ్‌లోకి వెళితే సంబంధిత తహసీల్దారు లేదా ఏఎస్ఓలు యాక్టివ్‌లోకి తీసుకొచ్చేందుకు జేసీకి లెటర్ రాయాల్సి ఉంది. అన్నీ సక్రమంగా ఉంటే జాయింట్ కలెక్టర్ ఇన్ యాక్టివ్ కార్డులను యాక్టివ్‌లోకి తెస్తారు. చెప్పులు అరగాల్సిందే.. ఇన్ యాక్టివ్‌లో ఉన్న రేషన్ కార్డులను యాక్టివ్‌లోకి తెచ్చుకునేందుకు ఆరు నెలలు, ఏడాదిగా కొందరు లబ్ధిదారులు తహసీల్దార్, ఏఎస్ఓ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పరిస్థితి చూస్తే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో స్పష్టం అవుతోంది. అన్నీ సక్రమంగా ఉంటే కేవలం రెండు, మూడు రోజుల్లో అయ్యే పనిని సైతం నెలలు పాటు కాలయాపన చేస్తుండటం కార్డుదారుల అవస్థలకు అద్దం పడుతోంది. -
సంచార వైద్యానికి సుస్తీ
ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో కుంటుపడిన 104 వాహన సేవలు 842 రకాల మందులకు ఇస్తోంది 10 రకాలే సిబ్బంది, రక్తపరీక్ష కిట్ల కొరత మారుమూల గ్రామాల్లో ఉండే ప్రజల చెంతకే వెళ్లి వైద్యసేవలందించేందుకు ఏర్పాటు చేసిన 104 వాహనాలకు సుస్తీ చేసింది. సిబ్బంది, మందుల కొరత ఈ సంచార వైద్యశాలలను వేధిస్తోంది. రక్తపరీక్షల కిట్లూ కనపడటం లేదు. మెుత్తం మీద దీని ద్వారా అందించే సేవల్లో కోతలు పెట్టి రోగులను అవస్థలపాలు చేస్తున్నారు. ఒంగోలు సెంట్రల్: రోగి చెంతకి కదిలి వచ్చే ఆసుపత్రిలాంటి 104 వాహనాలకు సుస్తీ చేసింది. గతంలో 104 వాహనం ద్వారా 52 రకాలకు పైగా మందులు అందిస్తే ప్రస్తుతం ఆ సంఖ్య 42కు తగ్గింది. అవి కూడా తగ్గించి పదికి పరిమితం చేశారు. పేదల చెంతకే వైద్యాన్ని అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 మార్చిలో 104 వాహనాలను ప్రవేశపెట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక, సాధారణ వ్యాధులతో బాధపడుతున్న వారికి అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించాలన్నది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తొలినాళ్లలో మారుమూల ప్రాంతాల వారికి సైతం మెరుగైన సేవలందించిన 104 వాహనాలకు వైఎస్ మరణానంతరం ఒడిదొడుకులు మెుదలయ్యాయి. మందుల కొరత, చేయని పరీక్షలతో అరకొరగానే 104 వైద్యసేవలు అందుతున్నాయి. పైగా ప్రభుత్వం నుంచి ప్రైవేటు సంస్థకు ఈ సేవలు అప్పగించడంతో పూర్తిస్థాయిలో పథకం పనిచేయడం లేదు. గతంలో సేవలిలా.. నిర్ణీత షెడ్యూల్లో గ్రామాల్లోకి వెళ్లి బీపీ, షుగర్, ఉబ్బసం, ఫిట్స్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు జ్వరం, విరేచనాలు తదితర సాధారణ వ్యాధులతో బాధపడుతున్న రోగులకు వైద్యసేవలు అందించి నెలకు సరిపడా మందులు ఉచితంగా పంపిణీ చేసేవారు. ఆ వ్యాధులకు సంబంధించి గతంలో 52 రకాల మందులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం 42 రకాలు మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. అయితే వీటిలో ఏ ఒక్కటీ వాడటం లేదు. కొన్ని రకాల మందుల కాంబినేషన్లకు బదులుగా ఒక రకం మందులను మాత్రమే ఇచ్చి రెండో రకం మందులను బయట కొనుగోలు చేయాలని చెప్తున్నారు. సిబ్బంది, రక్తపరీక్ష కిట్ల కొరత... 104 వాహనంలో విధుల్లో ఆరుగురు ఉండాలి. వైద్యుడు, నర్సు, ఫార్మాసిస్టు, ల్యాబ్‌టెక్నీషియన్, డ్రైవర్, సెక్యూరిటీ గార్డు ఉన్నారు. అయితే చాలా చోట్ల ఇద్దరు సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. ఉదాహరణకు ఉలవపాడు పార్కింగ్ ప్లేస్‌కు సంబంధించి కేవలం వైద్యుడు, నర్సు మాత్రమే సేవలు అందిస్తున్నారు. మలేరియా, యూరిన్ పరీక్షలు, షుగర్ పరీక్షలు, గర్భనిర్ధారణ పరీక్షలు, ఈఎస్ఆర్, బ్లడ్ గ్రూప్, హిమోగ్లోబిన్ పరీక్షలను ఉచితంగా చేయాల్సి ఉండగా వాహనంలో కనీసం రక్త పరీక్షలు చేసే కిట్లు కూడా కనిపించడం లేదు. రక్త పరీక్షలను పూర్తిగా నిలిపేశారు. చాలా చోట్ల జ్వరం చూడటానికి ధర్మామీటర్లు కూడా లేవు. వాహనంలో పూర్తి స్థాయిలో 42 రకాల మందులు ఉండాలి అయితే కేవలం 10 రకాల మందులతోనే వాహనాలు సంచరిస్తున్నాయి. ఉన్న మందులతోటే అన్ని రకాల వ్యాధులకు ఒకటే ఔషధం తరహాలో చికిత్స అందిస్తున్నారు. వీటిని పట్టించుకోవాల్సిన 104 పిరమిల్ అధికారులు గుంటూరు జిల్లా నుంచి తమ విధులు నిర్వహిస్తున్నారు. కనీసం సిబ్బందికి కూడా అందుబాటులో ఉండటం లేదు. నెలకు అన్ని రకాల సేవలకు రూ.7 కోట్లు బడ్జెట్ ఉంది. జిల్లాలో 20 వాహనాలు తిరుగుతున్నాయి. అయినా నామమాత్రపు సేవలతో సరిపెడుతున్నారు.