
శాన్ ఫ్రాన్సిస్కో : మల్టీ-బిలియనీర్, టెక్ మొగల్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరోసారి షాకింగ్ న్యూస్ చెప్పారు. తాను సోషల్‌మీడియా ఖాతా ట్విటర్ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. తద్వారా 29 మిలియన్ల ట్విటర్ ఫాలోయర్లకు ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది జూన్‌లో తన ట్విటర్ అకౌంట్‌ను డిలీట్ చేస్తానని చెప్పడం ఇదిరెండవసారి. అయితే అప్పట్లో ఖాతాను తొలగిస్తానని చెప్పినప్పటికీ, అకౌంట్ యాక్టివ్‌గా ఉండటం విశేషం. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్ గురించి ఖచ్చితంగా తెలియదు కానీ, రెడ్‌ఇట్ బావుందంటూ వరుస పోస్ట్‌లలో వ్యాఖ్యానించారు. కాగా టెస్లా సీఈఓ అధికారిక రెడ్‌ఇట్ ఖాతా చాలా సంవత్సరాలుగా యాక్టివ్‌గా లేదు. అయితే ఈ పోస్ట్‌ల తర్వాత మస్క్ ట్విటర్ ఖాతా ఇప్పటికీ చురుకుగా వుండటం ఆసక్తికరం.
కాగా గత ఏడాది బ్రిటీష్ గజ ఈతగాడు వెర్నాన్ అన్‌స్వర్త్‌పై ఎలాన్ మస్క్ చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదానికి తీసాయి. థాయ్ గుహలో చిక్కుకుపోయిన 12 మంది బాలలు, సాకర్ కోచ్ రక్షణలో కీలక పాత్ర పోషించిన వెర్నాన్‌ను 'పేడో గై' అని పిలిచినందుకు వచ్చేనెలలో విచారణను ఎదుర్కోన్నారు. 57 వేల పౌండ్ల పరువు నష్టం దావా అతనిపై దాఖలైన సంగతి తెలిసిందే. అంతకుముందు, తన ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్లా గురించి తప్పుదోవపట్టించే కార్పొరేట్ సమాచారాన్ని అందించారంటూ యుఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆరోపణలు చేసింది. ఫలితంగా 20 మిలియన్ల జరిమానాను మస్క్ చెల్లించవలసి వచ్చింది.
Going offline
— Elon Musk (@elonmusk) November 1, 2019
Reddit still seems good
— Elon Musk (@elonmusk) November 1, 2019
Not sure about good of Twitter
— Elon Musk (@elonmusk) November 1, 2019
Comments
Please login to add a commentAdd a comment