ఉద్యోగుల అలవెన్స్లపై క్లారిటీ? | 7th Pay Commission: Committee on HRA, other allowances to submit its final report this week | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల అలవెన్స్లపై క్లారిటీ?

Published Tue, Apr 18 2017 8:56 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM

ఉద్యోగుల అలవెన్స్లపై క్లారిటీ?

ఉద్యోగుల అలవెన్స్లపై క్లారిటీ?

న్యూఢిల్లీ : ఉద్యోగులకు చెల్లించే భత్యాల విషయంలో ఈ వారంలో క్లారిటీ రానుంది. ఆర్థికకార్యదర్శి అశోక్ లావాసా నేతత్వంలో ఏర్పాటైన కమిటీ తన తుది నివేదికను ఆర్థికమంత్రిత్వ శాఖకు ఈ వారంలోనే సమర్పించేందుకు సిద్ధమైంది. భత్యాల విషయంలో లావాసా కమిటీ నివేదించే ప్రతిపాదనలతో మొత్తం 47 లక్షల మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, 53 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 196 భత్యాలలో 53 తీసివేయాలని, మరో 36 భత్యాలను కలపాలన్న 7వ వేతన సంఘం సిఫారసుపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేయడంతో ప్రభుత్వం గత ఏడాది లావాసా కమిటీని ఏర్పాటు చేసింది. క్లాస్ ఎక్స్, వై, జడ్ సిటీల బేసిక్ వేతనం ప్రకారం 24 శాతం, 16 శాతం, 8 శాతం, హెచ్ఆర్ఏ ఇవ్వాలని అంతకముందు 7వ వేతన సంఘం ప్రతిపాదించింది.
 
అదేవిధంగా డీఏ 50 శాతాన్ని దాటితే హెచ్ఆర్ఏ 27 శాతం, 18 శాతం, 9 శాతం ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం  హెచ్ఆర్ఏ రేటు బేసిక్ వేతనంపై 30 శాతం, 20 శాతం, 10 శాతంగా ఉంది. దాని మరింత తగ్గించి, 7వ వేతన సంఘం తమ సిపారసులను ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీంతో ఈ రేట్లపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేశారు.  ఈ విషయాలపై నెలకొన్న ప్రతిష్టంభనపై ఏర్పాటైన లావాసా కమిటీ తమ తుది నివేదికను ఈ వారంలో ప్రభుత్వానికి సమర్పించనుంది. బేసిక వేతనం, పెన్షన్ పెంచాలంటూ సిపారసు చేసిన ఏడవ వేతన సంఘ ప్రతిపాదనలను ప్రభుత్వం గతేడాది ఆమోదించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement