రైసీ దుర్మరణం వెనుక కుట్ర లేదు: ఇరాన్‌ ఆర్మీ | Chopper Of Irans Late President Crashed Due To Bad Weather Final Report | Sakshi
Sakshi News home page

మాజీ అధ్యక్షుడి దుర్మరణం వెనుక కుట్ర లేదు: ఇరాన్‌ ఆర్మీ

Published Mon, Sep 2 2024 7:25 AM | Last Updated on Mon, Sep 2 2024 9:40 AM

Chopper Of Irans Late President Crashed Due To Bad Weather Final Report

టెహ్రాన్‌: హెలికాప్టర్‌ కుప్పకూలి ఇరాన్‌ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలవ్వడానికి ప్రతికూల వాతావరణమే కారణమని తేలింది. ఈ మేరకు ఆ దేశ ఆర్మీ ఆధ్వర్యంలోని దర్యాప్తు కమిటీ ఇచ్చిన తుది నివేదికను ఉటంకిస్తూ ఇరాన్‌ అధికారిక టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దట్టమైన పొగమంచువల్లే  రైసీ హెలికాప్టర్‌ కూలిపోయిందని తెలిపింది. 

దీంతో హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రధాని రైసీ మరణించడం వెనుక ఇజ్రాయెల్‌ హస్తం ఉండొచ్చన్న అనుమానాలకు తెరపడింది. ఈ ఏడాది మేలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఇరాన్‌లోని అజర్‌బైజాన్‌ పర్వతప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రధాని రైసీ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ దుర్ఘటన జరిగినప్పుడు ఇరాన్‌, ఇజ్రాయెల్‌ మధ్య ఉద్రిక్తలు తారాస్థాయిలో ఉండటంతో​ ఇజ్రాయెల్‌ పాత్రపై అనుమానాలు రేకెత్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement