final report
-
రైసీ దుర్మరణం వెనుక కుట్ర లేదు: ఇరాన్ ఆర్మీ
టెహ్రాన్: హెలికాప్టర్ కుప్పకూలి ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం పాలవ్వడానికి ప్రతికూల వాతావరణమే కారణమని తేలింది. ఈ మేరకు ఆ దేశ ఆర్మీ ఆధ్వర్యంలోని దర్యాప్తు కమిటీ ఇచ్చిన తుది నివేదికను ఉటంకిస్తూ ఇరాన్ అధికారిక టీవీ ఓ కథనాన్ని ప్రసారం చేసింది. దట్టమైన పొగమంచువల్లే రైసీ హెలికాప్టర్ కూలిపోయిందని తెలిపింది. దీంతో హెలికాప్టర్ ప్రమాదంలో ప్రధాని రైసీ మరణించడం వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉండొచ్చన్న అనుమానాలకు తెరపడింది. ఈ ఏడాది మేలో రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇరాన్‌లోని అజర్బైజాన్ పర్వతప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రధాని రైసీ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ దుర్ఘటన జరిగినప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తలు తారాస్థాయిలో ఉండటంతో ఇజ్రాయెల్ పాత్రపై అనుమానాలు రేకెత్తాయి. -
ఎల్జీ పాలిమర్స్ ఘటన.. త్వరలోనే తుది నివేదిక
సాక్షి, అమరావతి: ఎల్జీ పాలిమర్స్ ఘటనపై సేకరించిన సమాచారం ఆధారంగా తుది నివేదికను త్వరలో సిద్ధం చేయనున్నామని హైపవర్ కమిటీ చైర్మన్ నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమ కమిటీ ఇప్పటికే సంబంధం ఉన్న అందరి నుండి సలహాలు, సూచనలు ప్రశ్నలు సేకరించడం జరిగిందన్నారు. దానిలో భాగంగా 243 రిప్రజెంటేషన్ 175 టెలిఫోన్, పబ్లిక్, వాట్సాప్ ను రిసీవ్ చేసుకున్నామని పేర్కొన్నారు. దాని ఆధారంగా కమిటీ ఒక ప్రశ్నావళి రూపొందించి ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఇతర రెగ్యులేటరీ అథారిటీ ద్వారా అందించడం జరిగిందని, ఇంకా ఎల్జీ పాలిమర్స్ నుంచి జవాబు అందాల్సి ఉందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను హైపవర్ కమిటీ తుది జాబితాలో పొందుపరుస్తామని ఆయన తెలిపారు. మే నెలలో విశాఖపట్నం సందర్శించిన హైపవర్ కమిటీ స్టేక్ హోల్డర్స్ అందరితో సుదీర్ఘ చర్చలు నిర్వహించిందన్నారు. జూన్ 15న ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్లు, నిపుణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించామన్నారు. ప్రమాదానికి సంబంధించిన కారణాలు ఘటనలపై విస్తృతంగా చర్చించడం జరిగిందన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వచ్చే వారంలో హైపవర్ కమిటీ మరిన్ని సమావేశాలు రెగ్యులేటరీ ఆథారిటీతో కలిపి నిర్వహించనుందని ఆయన తెలియజేశారు. -
దిశ కేసులో చార్జిషీట్‌కు రంగం సిద్ధం
-
దిశ కేసులో ‘ఫైనల్ రిపోర్ట్’
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ కేసులో పోలీసులు చార్జిషీటు దాఖలు చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కేసు లోని నలుగురు నిందితులు ఎన్కౌంటర్లో మరణించిన నేపథ్యంలో వీరిపై నేరాభియోగపత్రం (చార్జిషీటు) దాఖలు చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. త్వరలోనే సైబరాబాద్ పోలీసులు చార్జిషీటు స్థానంలో ఫైనల్ రిపోర్టును సమర్పించనున్నారని సమాచారం. నవంబర్ 27న శంషాబాద్ తొండుపల్లి టోల్గేట్ వద్ద ‘దిశ’అపహరణ, హత్య నుంచి డిసెంబర్ 6న చటాన్‌పల్లిలో నిందితుల ఎన్కౌంటర్ వరకు జరిగిన ఘటనలన్నింటిని వివరిస్తూ షాద్‌నగర్ కోర్టుకు ఫైనల్ రిపోర్టు సమర్పించనున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ కేసులో నిందితులకు వేగంగా శిక్ష పడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఆరంభానికి ముందే నిలిచిపోయింది. చదవండి: దిశ: ఆ మృతదేహాలను ఏం చేయాలి? కోర్టు ఏర్పాటు ప్రకటన అనంతరం నిందితులంతా హతమవ్వడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు సైబరాబాద్ పోలీసులు ఫైనల్ రిపోర్టును రూపొందించే పనిలో పడ్డారు. ఇది సమర్పించాక ఇక దర్యాప్తు దాదాపుగా ముగిసినట్లేనని ఓ సీనియ ర్ అధికారి వ్యాఖ్యానించారు. ఎన్‌కౌంటర్‌పై విచారణ చేయడానికి రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తన విచారణను కొనసాగించనుంది. ఇక ఎన్కౌంటర్ బూటకమంటూ సుప్రీంకోర్టులు పలు పిటిషన్లు దాఖలు కావడంతో దీనిపై విచారణకు ముగ్గురు సభ్యులతో ప్రత్యేక కమిషన్ ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఈ కమిటీ వారం రోజుల్లోపు నగరానికి రావొచ్చని డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ కమిషన్ సిఫార్సు మేరకే నిందితుల మృతదేహాల అప్పగింతపై తుది నిర్ణయం ఉంటుంది. అయితే తమ కుమారుల మృతదేహాలు త్వరగా అప్పగించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. చదవండి: దిశ: ఆ పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయండి చదవండి: దిశ చట్టం తెచ్చిన సీఎం జగన్‌కు జేజేలు -
గ్యాంగ్ రేప్‌లు.. సీల్డ్ కవర్లో నివేదిక
సాక్షి, హరియానా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముర్తల్ గ్యాంగ్ రేప్ ఘటనలకు సంబంధించి హరియానా ప్రభుత్వం ఎట్టకేలకు తుది నివేదికను రూపొందించింది. సీల్డ్ కవర్లో దర్యాప్తు వివరాలను గురువారం పంజాబ్ హరియానా హైకోర్టు బెంచ్‌కు సమర్పించింది. గత ఫిబ్రవరిలో జాట్ రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా హింస చెలరేగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో 10 మంది మహిళలపై సామూహిక అత్యాచార కేసులు చోటు చేసుకున్నాయి. ఈ నివేదికతోపాటు దాడులు, ఆ సమయంలో దాఖలైన ఇతర కేసులకు సంబంధించి కేసు డైరీలను ప్రభుత్వం కోర్టుకు అందించింది. ఓ ఆంగ్ల దిన పత్రిక కథనాల ఆధారంగా హైకోర్టు సుమోటోగా కేసును స్వీకరించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు పోలీస్ శాఖ దర్యాప్తు చేపట్టింది. ఇక తదుపరి విచారణను జనవరి 2018కి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 2016లో జాట్ రిజర్వేషన్ల ఉద్యమం హింసాత్మకంగా మారగా.. సోనేపట్ జిల్లాలో తారాస్థాయికి చేరుకుని మహిళలపై అఘాయిత్యాలు చోటు చేసుకున్నాయి. ఎక్కడ పడితే అక్కడ మహిళల దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ దృశ్యాలతోపాటు కొందరు బాధితుల కథనం మేరకు ఓ ఆంగ్ల పత్రిక వరుస కథనాలు ప్రచురించింది. అల్లర్లకు సంబంధించి మొత్తం 8 జిల్లాల్లో 2,100 ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యాయి. -
ఉద్యోగుల అలవెన్స్‌లపై క్లారిటీ?
న్యూఢిల్లీ : ఉద్యోగులకు చెల్లించే భత్యాల విషయంలో ఈ వారంలో క్లారిటీ రానుంది. ఆర్థికకార్యదర్శి అశోక్ లావాసా నేతత్వంలో ఏర్పాటైన కమిటీ తన తుది నివేదికను ఆర్థికమంత్రిత్వ శాఖకు ఈ వారంలోనే సమర్పించేందుకు సిద్ధమైంది. భత్యాల విషయంలో లావాసా కమిటీ నివేదించే ప్రతిపాదనలతో మొత్తం 47 లక్షల మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, 53 లక్షల మంది పెన్షనర్లు లబ్ది పొందనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 196 భత్యాలలో 53 తీసివేయాలని, మరో 36 భత్యాలను కలపాలన్న 7వ వేతన సంఘం సిఫారసుపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేయడంతో ప్రభుత్వం గత ఏడాది లావాసా కమిటీని ఏర్పాటు చేసింది. క్లాస్ ఎక్స్, వై, జడ్ సిటీల బేసిక్ వేతనం ప్రకారం 24 శాతం, 16 శాతం, 8 శాతం, హెచ్ఆర్ఏ ఇవ్వాలని అంతకముందు 7వ వేతన సంఘం ప్రతిపాదించింది. అదేవిధంగా డీఏ 50 శాతాన్ని దాటితే హెచ్ఆర్ఏ 27 శాతం, 18 శాతం, 9 శాతం ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం హెచ్ఆర్ఏ రేటు బేసిక్ వేతనంపై 30 శాతం, 20 శాతం, 10 శాతంగా ఉంది. దాని మరింత తగ్గించి, 7వ వేతన సంఘం తమ సిపారసులను ప్రభుత్వానికి ప్రతిపాదించింది. దీంతో ఈ రేట్లపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తంచేశారు. ఈ విషయాలపై నెలకొన్న ప్రతిష్టంభనపై ఏర్పాటైన లావాసా కమిటీ తమ తుది నివేదికను ఈ వారంలో ప్రభుత్వానికి సమర్పించనుంది. బేసిక వేతనం, పెన్షన్ పెంచాలంటూ సిపారసు చేసిన ఏడవ వేతన సంఘ ప్రతిపాదనలను ప్రభుత్వం గతేడాది ఆమోదించిన సంగతి తెలిసిందే. -
సుప్రీంకు ముద్గల్ కమిటీ నివేదిక
-
స్పాట్ ఫిక్సింగ్పై సుప్రీంకు ముద్గల్ కమిటీ నివేదిక
న్యూఢిల్లీ : ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్పై జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ సోమవారం సుప్రీంకోర్టుకు తుది నివేదిక సమర్పించింది. మూడు నెలల విచారణ అనంతరం ఈ కమిటీ తన తుది నివేదికను న్యాయస్థానానికి సీల్డ్ కవర్లో అందించింది. ఈ కేసుపై ఈనెల 10న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. బీసీసీఐ మాజీ చీఫ్, ఐసీసీ చైర్మన్ శ్రీనివాసన్‌తో పాటు టీఎన్‌సీఏ ప్రధాన కార్యదర్శి విశ్వనాథన్, క్యూ బ్రాంచ్ మాజీ ఎస్పీ సంపత్ కుమార్, సీనియర్ ఐపీఎస్ అధికారి అబాస్ కుమార్‌ను ముద్గల్ కమిటీ విచారించిన విషయం తెలిసిందే. -
ఆగస్టు నెలాఖరుకు తుది నివేదిక
-
ఆగస్టు నెలాఖరుకు తుది నివేదిక
పది రోజుల్లో ముసాయిదా: శివరామకృష్ణన్ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు అంశంపై తుది నివేదికను ఆగస్టు నెలాఖరుకు సమర్పించనున్నట్టు రాజధాని కమిటీ చైర్మన్ శివరామకృష్ణన్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సమాచారం తెప్పించుకుని పరిశీలిస్తున్నామని, మరో పది రోజుల్లో ముసాయిదా పేరాలతో నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపనున్నట్టు చెప్పారు. అనంతరం ఏపీ ప్రభుత్వ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తుది నివేదిక సమర్పిస్తామని గురువారం ఆయన ఢిల్లీలో మీడియాతో చెప్పారు. ‘‘ఈ రోజు మంత్రి నారాయణ మాకు కావాల్సిన సమాచారం ఇచ్చారు. ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమైన కార్యాలయాలన్నీ ఆంధ్రప్రదేశ్‌కి మధ్యలో, అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉండే ప్రాంతంలో ఉండాలని నిర్ణయించాం. గుంటూరు- విజయవాడ మధ్యే రాజధాని రాబోతోందన్న వదంతులకు నేను బాధ్యుణ్ని కాను. నేను వదంతులు పుట్టించలేను, కేవలం వాస్తవాల ఆధారంగానే మాట్లాడగలను’’ అన్నారు. ఒక సామాజిక వర్గం రాజధానిని గుంటూరు-విజయవాడ మధ్య తేవాలని ప్రయత్నిస్తున్నట్టు వస్తున్న ఆరోపణల్లో నిజంలేదని ఏపీ మంత్రి నారాయణ అన్నారు. విమర్శలు ఎవరు చేసినా, అంతిమంగా, సాంకేతికంగా అన్ని అంశాలను చూపిస్తామని చెప్పారు.