
సాక్షి, న్యూఢిల్లీ: ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంకు(ఏడీబీ) ఉపాధ్యక్షుడిగా కేంద్ర ఎన్నికల కమిషనర్ అశోక్ లావాస(62) ఎన్నికయ్యారు. ఎన్నికల కమిషనర్‌గా రెండేళ్ల పదవి కాలం మిగిలుండాగానే ఆయన పదవి నుంచి వైదొలుగుతున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆయన దానిని తిరస్కరించి ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఆయన స్థానంలో సుశీల్ చంద్రగత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. గతేడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ నియమావళిని ఉల్లఘించిన కేసులో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల పట్ల అశోక్ లావాస నిక్కచ్చిగా వ్యవహరించారు. దీంతో ఆయన కుటుంబీకులపై ఐటీ, ఈడీ దాడులు జరిగాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తప్పుకోవాలని అశోక్ లావాస నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment