అశోక్ లవాసా (పైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అశోక్ లావసా కుటుంబానికి ఐటీ శాఖ ద్వారా ఎదురు దెబ్బ తగిలింది. ఆయన భార్య నోవల్ సింఘాల్. కమార్తె, కుమారుడి ఆదాయంపై ఐటీ విభాగం దృష్టి సారించింది. ఆదాయ లెక్కల్లో తేడా ఉన్నట్టుగా గుర్తించిన అధికారులు ఈ నోటీసులు జారీ చేశారు. ముఖ్యంగా అశోక్ లవాసా తనయుడు నిర్వహిస్తున్న నౌరిష్ ఫుడ్స్ ఖాతాలలో అవకతవకలపై దృష్టి సారించిన ఐటీ విభాగం ఈ నోటీసులిచ్చింది. వారి ఆదాయ, వ్యయాలను గత కొన్నిరోజులుగా ఆదాయపు పన్ను శాఖ పరిశీలిస్తోంది.
2005 వరకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసిన నుంచి నోవల్ సింఘాల్ లావాసా ముందస్తు పదవీ విరమణ తీసుకున్నారు. ఆ తర్వాత వివిధ కంపెనీలకు డైరెక్టర్‌గా వ్యవహరించారు. అప్పటివరకు నోవాల్ రిటర్నులపై ఎలాంటి సందేహాలు తలెత్తలేదు. కానీ గత కొన్ని నెలలుగా మాత్రం భారీ తేడాను ఐటీ అధికారులు గుర్తించారు. ఆదాయ, వ్యయాల్లో తేడాకు గల కారణాలపై ఇటీవల నోటీసులు కూడా జారీ అయ్యాయి. 2015 నుంచి 2017 వరకు వివిధ కంపెనీలకు స్వతంత్ర డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో అక్రమంగా ఆదాయం కూడబెట్టారా అని ఐటీ అధికారులు ఆరాతీస్తున్నారు.
మరోవైపు దీనిపై నోవల్ సింఘాల్ స్పందించారు. తాను ఎలాంటి పన్నుల ఎగవేతకు, ఆదాయ అక్రమాలకు పాల్పడలేదని తెలిపారు. 28 సంవత్సరాల పాటుస్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లాస్ వన్ ఆఫీసర్‌గా పనిచేసిన తనకు బ్యాంకింగ్ సంబంధిత వ్యవహారాల్లో అపారమైన అనుభవం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం స్వతంత్ర డైరెక్టర్‌గా సహా వివిధ వృత్తిపరమైన కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5, 2019న అందుకున్న అన్ని ఐటీ నోటీసులకు తాను సమాధానం ఇచ్చాననీ, ప్రస్తుత ప్రక్రియకు కూడా సహకరిస్తున్నానని ఆమె వివరణ ఇచ్చారు.
కాగా అంతకుముందు కేంద్ర ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసి అశోక్ గతేడాది జనవరి 23న కేంద్ర ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంశంపై కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరా, కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ చంద్రతో అశోక్ విభేదించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment