ముంబై: కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో 0.6 శాతానికి తగ్గింది. వాణిజ్య లోటు తగ్గడంతో క్యాడ్ జీడీపీలో 0.6 శాతంగా (340 కోట్ల డాలర్లు) నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో ఈ క్యాడ్ జీడీపీలో 1.7 శాతంగా (850 కోట్ల డాలర్లు) ఉంది. అయితే ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో క్యాడ్(జీడీపీలో 0.1 శాతం–30 కోట్ల డాలర్లు)తో పోల్చితే క్యూ2లో కరెంట్ అకౌంట్ లోటు అధికంగా ఉంది.
ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం...
విదేశాల్లోని భారతీయులు భారత్‌కు పంపించే రెమిటెన్సెస్‌కు ప్రాతినిధ్యం వహించే ప్రైవేట్ బదిలీ వసూళ్లు 11 శాతం తగ్గి 1,520 కోట్ల డాలర్లకు తగ్గాయి. వాణిజ్య దిగుమతులు భారీగా తగ్గడంతో వాణిజ్య లోటు తగ్గింది(2,560 కోట్ల డాలర్లు) దీంతో క్యాడ్ కూడా తగ్గింది. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే కరంట్ అకౌంట్ లోటు జీడీపీలో 0.3 శాతానికి తగ్గింది. గత క్యూ2లో ఇది 1.5 శాతంగా నమోదైంది.
సెప్టెంబర్ క్వార్టర్‌లో తగ్గిన క్యాడ్
Published Wed, Dec 14 2016 12:57 AM | Last Updated on Mon, Sep 4 2017 10:38 PM
Advertisement
Advertisement