మంచి కాలం కనబడుతోంది
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు మంచి రోజులు కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థికమంత్రి పీ చిదంబరం పేర్కొన్నారు. మంచి పంట దిగుబడులకు అవకాశం, ఎగుమతులు పెరిగే సంకేతాలు, బంగారం దిగుమతులు తగ్గుతున్న వైనం... తద్వారా కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత అంచనా 70 బిలియన్ డాలర్ల నుంచి 60 బిలియన్ డాలర్లకు తగ్గే అవకాశం వంటి అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. అయితే ద్రవ్యోల్బణం, పెట్టుబడుల పునరుద్ధరణ వంటి అంశాలు మాత్రం ఇంకా సవాళ్లను ఎదుర్కొంటున్నాయని విలేకరులతో అన్నారు.