లోటు 2,000 కోట్ల డాలర్లలోపే
• గత ఏడాది కంటే తక్కువ ఉండొచ్చు
• క్యాడ్‌పై రేటింగ్ సంస్థ ఇక్రా అంచనా
ముంబై: భారత కరంట్ అకౌంట్ లోటు (క్యాడ్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,000 కోట్ల డాలర్లలోపే ఉండొచ్చని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం కన్నా (2,200 కోట్ల డాలర్ల) తక్కువగానే ఉండగలదని పేర్కొంది. ఈ ఏడాది మిగిలిన కాలంలో పుత్తడికి ఉండే డిమాండ్, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో అర్థబాగం క్యాడ్‌పై ప్రభావం చూపుతాయని వివరించింది. అంతర్జాతీయ పోకడలను పరిగణనలోకి తీసుకుంటే ఔన్‌స బంగారం 1,150-1,250 (ప్రస్తుతం 1,165 డాలర్లుగా ఉంది) డాలర్ల రేంజ్‌లో ఉండగలదని అంచనా వేస్తోంది. ఇక్రా వెల్లడించిన వివరాల ప్రకారం..,
⇔ ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ కాలానికి పుత్తడి దిగుమతి బిల్లు అంతకు ముందటి ఆరు నెలల కంటే అధికంగా ఉండొచ్చు.
⇔ {పస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల క్యాడ్ కన్నా రెండో అర్థభాగం క్యాడ్ అధికంగా ఉండే అవకాశాలున్నారుు.
⇔ ఆదాయపన్ను చట్టానికి ఇటీవల చేసిన సవరణలు పుత్తడికి డిమాండ్‌ను తగ్గిస్తారుు. దీంతో రానున్న నెలల్లో పుత్తడి దిగుమతులు తగ్గవచ్చు.
⇔ ఈ ఏడాది ఏప్రిల్-నవంబర్ కాలానికి పుత్తడి దిగుమతులు నెలకు సగటున 45 టన్నులుగా ఉన్నారుు. ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకూ బంగారం దిగుమతులు ఇదే స్థారుులో ఉంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరంట్ అకౌంట్ లోటు 1,500 కోట్ల డాలర్లలోపే ఉండొచ్చు.
⇔ గత ఏడాది ఏప్రిల్-అక్టోబర్ కాలానికి 2,310 కోట్ల డాలర్లుగా ఉన్న రత్నాలు, ఆభరణాల ఎగుమతులు ఈ ఏడాది ఇదే కాలానికి 2,640 కోట్ల డాలర్లకు పెరిగారుు.
⇔ పెద్ద కరెన్సీ నోట్ల రద్దు, పెళ్లిళ్లు, పండగుల సీజన్ తదితర కారణాల వల్ల గత నెలలో పుత్తడి దిగుమతులు పెరిగారుు.
⇔ గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో 610 కోట్ల డాలర్లుగా ఉన్న కరంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఈ ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో 30 కోట్ల డాలర్లకు తగ్గింది.
⇔ గత క్యూ2లో 850 కోట్ల డాలర్లుగా ఉన్న క్యాడ్ ఈ క్యూ2లో సగానికి పైగా తగ్గి 250-350 కోట్ల డాలర్లకు తగ్గవచ్చు.