నిరర్ధక ఆస్తులను నియంత్రించాల్సిన బాధ్యత నుంచి బ్యాంకులు తప్పించుకోజాలవని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రంగరాజన్ అన్నారు
హైదరాబాద్: నిరర్ధక ఆస్తులు పెరిగిపోతున్న నేపథ్యంలో బ్యాంకులు వాటిని నియంత్రించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోజాలవని రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రంగరాజన్ అన్నారు. 2017 యూనియన్ బడ్జెట్‌పై జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పెద్దనోట్ల రద్దుతో తలెత్తిన గందరగోళం ప్రస్తుతం సమసిపోయినప్పటికీ రియల్‌ఎస్టేట్ వంటి రంగాలపై కొన్ని దుష్ఫలితాలు ఇంకా అలాగే ఉన్నాయని అన్నారు. బ్యాంకింగ్ రంగం తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాయన్నది నిర్వివాదాంశమని అభిప్రాయపడ్డారు. దీనిని క్యాపిటలైజేషన్ ద్వారా పరిష్కరించాల్సి ఉందని చెప్పారు.