
వారం రోజుల గరిష్టం
మరో 63 పాయింట్లు ప్లస్ ఇంట్రాడేలో 22,600ను దాటిన సెన్సెక్స్
సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై దృష్టిపెట్టిన ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో మార్కెట్లు మరోసారి స్వల్ప స్థాయి కదలికలకే పరిమితమయ్యాయి. సెన్సెక్స్ 63 పాయింట్లు పెరిగి 22,508 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా, ఒక దశలో 22,602ను అధిగమించింది. నిఫ్టీ కూడా 16 పాయింట్లు లాభపడి 6,715 వద్ద నిలిచింది. పసిడి దిగుమతులు తగ్గడం, ద్రవ్యోల్బణం ఉపశమించడం కారణంగా కరెంట్ ఖాతా లోటు కట్టడికానుందన్న ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్ రంగరాజన్ వ్యాఖ్యలు సెంటిమెంట్‌ను బలపరిచినట్లు నిపుణులు తెలిపారు.
వినియోగ వస్తు రంగం జోష్
మంగళవారం ట్రేడింగ్‌లో వినియోగ వస్తు ఇండెక్స్ 3% పుంజుకోవడం విశేషం. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్, వీఐపీ, బజాజ్ ఎలక్ట్రికల్స్, టైటన్ 12-4% మధ్య జంప్‌చేయడం ఇందుకు దోహదపడింది. ఇక సెన్సెక్స్ దిగ్గజాల లో ఆర్‌ఐఎల్, ఐసీఐసీఐ, ఎల్‌అండ్‌టీ, ఐటీసీ 2-1% మధ్య లాభపడగా, భారతీ, హీరోమోటో, టాటా పవర్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ 2-1% మధ్య నష్టపోయాయి. కాగా,చిన్న షేర్లకు మళ్లీ డిమాండ్ కనిపించింది. అతుల్, జస్ట్‌డయల్, ఎన్‌సీసీ, టొరంట్ ఫార్మా, షషున్ ఫార్మా, కార్బొరేండమ్, సిటీ యూనియన్, టొరంట్ పవర్, టిమ్‌కెన్ 13-6% మధ్య దూసుకెళ్లాయి. అయితే మరోవైపు రెయిన్, కెనరా, గ్రీన్‌ప్లై, ఫ్యూచర్ రిటైల్, ఆప్టో, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ 10-5% మధ్య తిరోగమించాయి.