డెహ్రడూన్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పుటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని ఒక గిరిజన గ్రామ నివాసితులకు కోవిడ్-19 పరీక్షలను నిర్వహించడానికి జిల్లా ఆరోగ్య కార్యకర్తల బృందం వెళ్లినప్పుడు సమీపంలోని అడవికి పరిగెత్తారు. కరోనా పరీక్ష చేయించుకుంటే తమకు సోకుతుందని గ్రామస్తులు భయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ గ్రామంలో బన్రావాట్స్ నివసిస్తున్నారని, వీరు ఆదిమ తెగ వాసులని అధికారులు పేర్కొన్నారు.
ఇక దేశంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,73,790 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,29,247కి చేరింది. ఇందులో 22,28,724 యాక్టివ్ కేసులు ఉండగా, 2,51,78,011 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న 3617 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,22,512కి చేరుకుంది. నిన్న కొత్తగా 2,84,601 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
చదవండి: వీళ్లు కరోనా ఉన్నట్లు మరిచారేమో.. అందుకే ఇలా?
Comments
Please login to add a commentAdd a comment