సాక్షి, హైదరాబాద్: దేశంలో సాధారణ ప్రజలతో పోలిస్తే గిరిజనులు కోవిడ్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయోలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు తాజా పరిశోధనలో తేల్చారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు గిరిజన తెగల ప్రజలపై కోవిడ్ తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో ఈ పరిశోధనకు ప్రాధాన్యం ఏర్పడింది. సీసీఎంబీ శాస్త్రవేత్త, సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ (సీడీఎఫ్‌డీ) డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ ఈ పరిశోధనలు చేపట్టారు.
సీసీఎంబీ... అండమాన్ నికోబార్ దీవుల్లోని స్థానిక తెగల ప్రజల జన్యుక్రమాలను పరిశీలించి.. వారు కోవిడ్ బారిన పడేందుకు ఉన్న అవకాశాలపై ఒక అంచనా కట్టింది. బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబేతో కలసి చేపట్టిన ఈ పరిశోధన కోసం మొత్తం 1,600 మంది గిరిజన తెగల ప్రజల జన్యు క్రమాలను విశ్లేíÙంచారు. మొత్తం 227 తెగలకు చెందిన (అండమాన్‌లోని ఒంగే, జరావా తెగలు కలుపుకొని) జన్యుక్రమాల్లో కోవిడ్‌కు గురయ్యేందుకు అవకాశమున్న పొడవాటి డీఎన్‌ఏ పోగులు ఉన్నట్లు తెలిసింది.
మానవ పరిణామానికి సజీవ సాక్ష్యాలు...
అండమాన్ తెగల జన్యుక్రమాల ద్వారా వారి మూలలను వెలికి తీసిన తంగరాజ్ అంచనా ప్రకారం.. ఒంగే, జరావా తెగల వారితోపాటు దేశంలోని కొన్ని ఇతర తెగల ప్రజలూ కోవిడ్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది. జరావా తెగల ప్రజల్లో ఏస్2 జన్యువులోని మార్పులు ఎక్కువ మందిలో ఉన్నాయని, ఈ జన్యుమార్పులు ఉన్న వారు కోవిడ్ బారిన పడేందుకు అవకాశాలు ఎక్కువని ప్రొఫెసర్ జ్ఞానేశ్వర్ చౌబే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment