flees away
-
కరోనా పరీక్షలు చేస్తామన్నారు.. అడవిలోకి పారిపోయారు
డెహ్రడూన్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పుటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని ఒక గిరిజన గ్రామ నివాసితులకు కోవిడ్-19 పరీక్షలను నిర్వహించడానికి జిల్లా ఆరోగ్య కార్యకర్తల బృందం వెళ్లినప్పుడు సమీపంలోని అడవికి పరిగెత్తారు. కరోనా పరీక్ష చేయించుకుంటే తమకు సోకుతుందని గ్రామస్తులు భయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ గ్రామంలో బన్రావాట్స్ నివసిస్తున్నారని, వీరు ఆదిమ తెగ వాసులని అధికారులు పేర్కొన్నారు. ఇక దేశంలో కరోనా వైరస్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,73,790 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 2,77,29,247కి చేరింది. ఇందులో 22,28,724 యాక్టివ్ కేసులు ఉండగా, 2,51,78,011 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న 3617 మంది కరోనాతో మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,22,512కి చేరుకుంది. నిన్న కొత్తగా 2,84,601 మంది దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. చదవండి: వీళ్లు కరోనా ఉన్నట్లు మరిచారేమో.. అందుకే ఇలా? -
జొమాటో వివాదం: పరారీలో యువతి..!
బెంగళూరు: గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న జొమాటో వివాదంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. డెలివరీ బాయ్ తనను కొట్టాడని ఆరోపించిన యువతి హితేషా చంద్రాణి బెంగళూరు నుంచి పారిపోయినట్లు సమాచారం. డెలివరీ బాయ్ కామరాజ్ చంద్రాణి మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు ఆమెని విచారణకు హాజరు కావాల్సిందిగా కోరారు. కానీ ఆమె ప్రస్తుతం తాను బెంగళూరులో లేనని.. మహారాష్ట్ర వెళ్లానని తెలిపారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ‘‘కామరాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేం చంద్రాణి మీద కేసు నమోదు చేశాం. విచారణకు రావాల్సిందిగా కోరాం. అయితే ఆమె ‘‘ప్రస్తుతం నేను సిటీలో లేను.. మహారాష్ట్రలోని మా బంధువుల ఇంటికి వెళ్లాను’’ అని తెలిపింది. బెంగళూరు వచ్చాక విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించాం. ఒకవేళ చంద్రాణి విచారణకు హాజరు కాకపోతే ఆమెను అరెస్ట్ చేస్తాం’’ అన్నారు. అంతేకాక ప్రసుత్తం దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. చంద్రాణి ఫిర్యాదు మేరకు తొలుత పోలీసులు కామరాజ్‌ను అరెస్ట్ చేశారు. బెయిల్ మీద విడుదలైన అతను చంద్రాణి మీద పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆమె ఉద్దేశపూర్వకంగా తనను అవమానించిందని.. నేరపూరిత బెదిరింపులకు పాల్పడిందని.. తన మీదకు షూ విసిరి అవమానించిందని.. తప్పుడు ఫిర్యాదుతో తన పరువు తీసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక ఈ వివాదంపై సోషల్ మీడియా రెండుగా చీలిపోయింది. బాలీవుడ్ హీరోయిన్లు సహా ఎక్కువ మంది నెటిజనులు డెలివరీ బాయ్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. వివాదంపై జొమాటో సహ వ్యవస్థాపకుడు దీపేందర్ గోయల్ స్పందించారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, త్వరలోనే వాస్తవాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. అప్పటి వరకు హితేషా చంద్రాణి వైద్య ఖర్చులు, అదే విధంగా అరెస్టైన డెలివరీ బాయ్ లీగల్ ఖర్చులు తామే భరిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: కొత్త ట్విస్ట్: యువతికి షాకిచ్చిన జొమాటో డెలివరీ బాయ్ డెలివరీ బాయ్ ఏ పాపం ఎరుగడు: బాలీవుడ్ హీరోయిన్ -
4 కిలోల బంగారం దొంగ అరెస్టు
సాక్షి, నిజామాబాద్ క్రైం(నిజామాబాద్‌అర్బన్): వారం రోజుల క్రితం నాలుగు కిలోల బంగారంతో ఉడాయించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 3.05 కిలోల బంగారం, 6 డైమండ్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వెస్ట్‌బెంగాల్ హుగ్లీ జిల్లా కుల్లత్ గ్రామానికి చెందిన భూపాల్ మన్నా ఆర్మూర్‌లో స్థిరపడ్డాడు. బంగారు అభరణాలు తయారు చేస్తూ, నమ్మకంగా ఉండడంతో బంగారు వ్యాపారులు కిలోల కొద్ది బంగారం ఇచ్చి అభరణాలు చేయించుకునే వారు. ఇలా ఆర్మూర్, నందిపేట్, నిర్మల్ ప్రాంతాలకు చెందిన బంగారు వ్యాపారులు కలిసి నాలుగు కిలోల బంగారాన్ని ఇచ్చారు. పెద్ద మొత్తంలో బంగారం అతని వద్ద ఉండటంతో భూపాల్‌కు దురాలోచన కలిగింది. దీంతో నాలుగు రోజుల క్రితం బంగారంతో ఉడాయించాడు. అయితే, ఆభరణాలు చేయాలని బంగారం ఇచ్చిన జక్రాన్‌పల్లి మండలం మునిపల్లికి చెందిన వ్యాపారి ఆరే శివకుమార్ ఈ నెల 23న వెళ్లగా షాప్ మూసి ఉంది. మిగతా వ్యాపారులు కూడా అక్కడకు చేరుకోవడంతో భూపాల్ ఉడాయించినట్లు తేలింది. శివకుమార్ ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ఆర్మూర్ ఏసీపీ శివకుమార్ పర్యవేక్షణలో టౌన్ సీఐ సీతారాం, ఎస్సై గోపీ ఆధ్వర్యంలో హెడ్ కానిస్టేబుల్ రాములు, కానిస్టేబుల్ మల్లేశ్ నాగ్‌పూర్ వెళ్లారు. నిందితుడు కటక్ వెళ్లినట్లు గుర్తించి అతడ్ని పట్టుకున్నారు. పోలీసుల ఎదుట తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఇతడ్ని అరెస్టు చేసే ముందు ఆర్మూర్ పోలీసులు కటక్ మేజిస్ట్రేట్ ఎదుట శుక్రవారం హాజరు పరిచారు. అనంతరం అరెస్టు చేసి శనివారం ఆర్మూర్‌కు తీసుకువచ్చారు. నిందితుడి నుంచి 3.05 కిలో బంగారు అభరణాలు, 6 డైమండ్లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
1.37 కోట్లతో ఉడాయించిన డ్రైవర్
బెంగళూరు: ఏటీఎంకి డబ్బు సరఫరా చేసే వ్యాను డ్రైవర్ కోటీ ముప్పై ఏడు లక్షలతో ఉడాయించాడు. ఈ సంఘటన బెంగళూరులోని కేజీ రోడ్లో బుధవారం చోటుచేసుకుంది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత చాలా వరకు ఏటీఎంలు పని చేయడం లేదు. పెద్ద నోట్ల రద్దుతో కొత్త నోట్లు దొరకడం సామాన్యులకు ఇబ్బందిగా మారింది. ఇలాంటి సమయంలో పెద్ద మొత్తంలో కొత్త నోట్లను డ్రైవర్ చోరీ చేయడంతో బ్యాంకు సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఈ సంఘనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.