
ఉత్తరాఖండ్: వచ్చే ఏడాది ఉత్తరాఖండ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్‌కు గంటపాటు ఆదనంగా సమయాన్ని కేటాయిస్తున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుషీల్ చంద్ర శుక్రవారం ప్రకటించారు. కరోనా ఉధృతి కారణంగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు చెందిన ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోవడం కష్టతరంగా మారిందని, అందుకే దేశంలోనే తొలిసారిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు.
వచ్చే ఏడాది ప్రారంభంలో ఉత్తరాఖండ్‌లో అసెంట్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే! ఐతే ఓటింగ్ సమయాన్ని గంటపాటు పొడిగిస్తున్నట్లు ఈ రోజు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుషీల్ చంద్ర మీడియాకు తెలిపారు. దీనితో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. కాగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్ర రెండు రోజుల ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్నారు. చంద్ర వెంట ఎన్నికల కమిషనర్లు రాజీవ్ కుమార్, అనూప్ చంద్ర పాండే ఉన్నారు.
ఐతే రాష్ట్రవ్యాప్తంగా 601 మైదానాలు, 277 భవనాలను గుర్తించామని, వీటిల్లో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎన్నికల సమావేశాలు నిర్వహించవచ్చని ఆయన తెలిపారు. అభ్యర్థులు వాటిని బుక్ చేసుకునేందుకు వీలుగా, వీటికి సంబంధించిన వివరాలు త్వరలో ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ బుకింగ్‌లు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ ప్రాతిపదికన మాత్రమే చేయబడతామని సుషీల్ చంద్ర సూచించారు.
చదవండి: Hyderabad: పబ్బుల యాజమాన్యాలకు సీపీ సీరియస్ వార్నింగ్!!