2023 ఉత్తరాఖండ్‌కు ప్రమాదాల సంవత్సరంగా నిలిచింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లో పలు భారీ ప్రమాదాలు జరిగాయి. 2023 ప్రారంభం నుండి చివరి వరకు ఏదో ఒక విపత్తు చోటుచేసుకుంటూనే ఉంది.
ఈ ఏడాది ఉత్తరాఖండ్‌కు అనేక చేదు అనుభవాలను మిగిల్చింది. ఏడాది ప్రారంభంలోనే జోషిమఠ్‌లో భూమి కుంగిపోయిన ఘటన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనలోకి నెట్టివేసింది. 2023 జనవరిలో చమోలి జిల్లా జోషిమఠ్‌లోని ఇళ్లు, రోడ్లకు అకస్మాత్తుగా భారీ పగుళ్లు కనిపించాయి. కుంగిపోతున్న జోషిమఠ్ అందరినీ కలవరానికి గురి చేసింది. ఈ వార్త దేశ విదేశాల్లో కూడా పతాక శీర్షికల్లో నిలిచింది.
ఈ ఏడాది ఉత్తరాఖండ్‌లోని చమోలీలో నమామి గంగే ప్రాజెక్టు పనులు కొనసాగుతుండగా విద్యుదాఘాతానికి గురై 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం జరిగినప్పుడు 24 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ దుర్ఘటన నేపధ్యంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బాధితులను పరామర్శించారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, గాయపడిన వారికి ఒక్కొక్కరికి లక్ష చొప్పున పరిహారం అందించారు.
ఈ ఏడాది ఆగస్టు నెలలో ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి హైవేపై నుంచి బస్సు కాలువలో పడి ఏడుగురు మృతి చెందగా, 28 మంది గాయపడ్డారు. నవంబర్‌లో ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌లో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 14 మంది మరణించారు.
దీపావళి రోజున ఉత్తరకాశీలో సొరంగం కూలి 41 మంది కార్మికులు దానిలో చిక్కుకుపోయారు. వారిని బయటకు తీసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. అయితే ఎట్టకేలకు వారిని 17 రోజుల తరువాత ర్యాట్ హోల్ మైనర్స్ బయటకు తీసుకువచ్చారు.
ఇది కూడా చదవండి: అయోధ్య విమానాశ్రయం చూతము రారండి!
Comments
Please login to add a commentAdd a comment