మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. టుస్కానీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని సందడి చేశారు. ఈ ఏడాది జూన్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వారి పెళ్లికి ముందు జరిగిన కాక్‌టైల్, మెహందీ, హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మొత్తానికి మెగా కోడలిగా హైదరాబాద్‌లో అడుగు పెట్టబోతోంది.
(ఇది చదవండి: లావణ్య అక్కా.. నీ పెళ్లికి చిరంజీవి వస్తాడా?.. ఇప్పుడదే నిజమైంది!)
ఈ నేపథ్యంలో లావణ్య గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి. లావణ్య త్రిపాఠి డిసెంబర్ 15, 1990లో ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని ఫైజాబాద్‌లో జన్మించింది. యూపీలో పుట్టినప్పటికీ ఆమె విద్యాభ‍్యాసం అంతా ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగింది. ఆ తర్వాత గ్రాడ్యుయేషన్ కోసం ముంబయి చేరుకున్న లావణ్య రిషి దయారామ్ నేషనల్ కాలేజీలో ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది.
అనంతరం మోడలింగ్‌లో అడుగుపెట్టిన లావణ్య.. 2012లో అందాల రాక్షసి చిత్రం ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. అందాల రాక్షసి చిత్రానికి లావణ్య ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. అయితే సినిమాల్లో రాకముందు ఆమె హిందీ సీరియల్ ప్యార్ కా బంధన్ (2009)తో తొలిసారిగా నటించింది.
అయితే ముంబైకి వెళ్లే ముందే ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లోని మార్షల్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె పాఠశాలలో ఉన్నప్పుడే 2006లో మిస్ ఉత్తరాఖండ్ టైటిల్‌ను గెలుచుకుంది. లావణ్య తండ్రి న్యాయవాది కాగా.. ఆమె తల్లి రిటైర్డ్ టీచర్. ఆమెకు ఇద్దరు అన్నయ్యలు, ఒక తమ్ముడు, ఒక సోదరి కూడా ఉన్నారు. ఒకప్పుడు మిస్ ఉత్తరాఖండ్.. ఇప్పుడు మెగా కోడలిగా తెలుగువారికి మరింత దగ్గరైంది. వరుణ్ తేజ్- లావణ్య జంటగా మిస్టర్ (2017), అంతరిక్షం చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: వాడో వేస్ట్‌గాడు, ఐటం రాజా.. అమర్‌పై మళ్లీ విషం కక్కిన శివాజీ)
Comments
Please login to add a commentAdd a comment