కాబోయే మెగా కోడలు లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న లావణ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ ఆ ఫోటోలో ఏముందో ఓ లుక్కేద్దాం.
(ఇది చదవండి: ఓటీటీలోకి సూపర్‌హిట్ 'గురక సినిమా'.. అస్సలు మిస్సవ్వొద్దు!)
తాజాగా లావణ్య త్రిపాఠి తన ఫోన్ వాల్ పేపర్‌ను ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు. అందులో కుటుంబ సభ్యులు, స్నేహితులతో ప్రత్యేక సందర్భాల్లో దిగిన పలు ఫొటోలు కూడా ఉన్నాయి. అయితే ఆ పిక్స్‌లో తనకు కాబోయే భర్త వరుణ్ తేజ్ ఫొటో కూడా కనిపించింది. అందులో మై లవ్స్.. డ్రీమ్ బిగ్గర్’ అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా కావడంతో నెటిజన్లు క్యూట్ జోడీ అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. లావణ్య త్రిపాఠి తొలిసారి మిస్టర్ చిత్రంలో జంటగా నటించారు. ఆ మూవీ చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ ఏడాదిలోనే చివర్లో ఈ జంట వివాహం జరగనున్నట్లు సమాచారం.
(ఇది చదవండి: 'ఏజెంట్'పై ఆ నిర్మాత కామెంట్స్.. దేవుడు కాపాడాడని! )
Comments
Please login to add a commentAdd a comment