లారా ‘పెద్ద మనసు’ | Brian Lara plays charity match to raise funds for Uttarakhand flood victims | Sakshi
Sakshi News home page

లారా ‘పెద్ద మనసు’

Oct 4 2013 2:02 AM | Updated on Sep 1 2017 11:18 PM

లారా ‘పెద్ద మనసు’

లారా ‘పెద్ద మనసు’

ఊహకందని విషాదం...దేశాన్నే శోకంలో ముంచెత్తిన ఘటన ఉత్తరాఖండ్ వరదల విలయం. ఇలాంటి స్థితిలో భారత స్టార్ క్రికెటర్లందరూ సానుభూతి ప్రకటనలకే పరిమితయ్యారు తప్ప ముందుకు వచ్చి ఏదో రూపంలో సహాయం అందించడానికి ప్రయత్నించలేదు.

డెహ్రాడూన్: ఊహకందని విషాదం...దేశాన్నే శోకంలో ముంచెత్తిన ఘటన ఉత్తరాఖండ్ వరదల విలయం. ఇలాంటి స్థితిలో భారత స్టార్ క్రికెటర్లందరూ సానుభూతి ప్రకటనలకే పరిమితయ్యారు తప్ప ముందుకు వచ్చి ఏదో రూపంలో సహాయం అందించడానికి ప్రయత్నించలేదు.
 
  కానీ ఎక్కడో వెస్టిండీస్‌కు చెందిన దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా మాత్రం బాధితుల సహాయానికి నిధులు చేకూర్చే కార్యక్రమానికి అండగా నిలిచాడు. వరద బాధితుల కోసం కేదార్ ఘాటీలో ఆస్పత్రి నిర్మాణానికి కావాల్సిన మొత్తం కోసం లారా గురువారం ఇక్కడ ఒక ఛారిటీ క్రికెట్ మ్యాచ్ ఆడాడు. ఇక్కడి అభిమన్యు క్రికెట్ అకాడమీలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఈ మ్యాచ్ నిర్వహించింది. అంతకు ముందు లారా ప్రఖ్యాత డూన్ స్కూల్‌ను కూడా సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement