![Ranji Trophy: Andhra 198/8 - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/21/Untitled-16.jpg.webp?itok=Gj82CUkj)
సాక్షి, ఒంగోలు: సొంతగడ్డపై తమిళనాడుతో మంగళవారం ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు బ్యాటింగ్‌లో తడబడింది. పేసర్ మొహమ్మద్ (4/60) ధాటికి తొలి రోజు ఆంధ్ర 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కెరీర్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న పి.గిరినాథ్ రెడ్డి (149 బంతుల్లో 69 బ్యాటింగ్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు)తో పాటు జ్యోతి సాయికృష్ణ (149 బంతుల్లో 58; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఇతర ప్రధాన బ్యాట్స్‌మెన్ ప్రశాంత్ (4), అశ్విన్ హెబర్ (12), రికీ భుయ్ (22), కెప్టెన్ బోడపాటి సుమంత్ (1) విఫలమయ్యారు. సాయికృష్ణతో ఐదో వికెట్‌కు 73 పరుగులు జోడించిన గిరినాథ్, ఏడో వికెట్‌కు షోయబ్ ఖాన్ (26)తో 53 పరుగులు జత చేశాడు. సాయికిషోర్, నటరాజన్ చెరో 2 వికెట్లు తీశారు.
తన్మయ్ శతకం...
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీతో జరుగుతున్న మరో మ్యాచ్‌లో హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 232 పరుగులు చేసింది. తన్మయ్ అగర్వాల్ (241 బంతుల్లో 112 బ్యాటింగ్; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీ సాధించగా, హిమాలయ్ అగర్వాల్ (190 బంతుల్లో 66; 7 ఫోర్లు) అర్ధ సెంచరీ నమోదు చేశాడు. తన్మయ్, హిమాలయ్ మూడో వికెట్‌కు 135 పరుగులు జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment