Mumbai Video Analyst Shivam Dube Tests Covid Positive Ahead Of Ranji Trophy - Sakshi
Sakshi News home page

Shivam Dube: టీమిండియా ఆల్‌రౌండర్‌కి కరోనా పాజిటివ్‌..

Published Mon, Jan 3 2022 12:50 PM | Last Updated on Mon, Jan 3 2022 3:41 PM

shivam dube Test Positive For Covid 10 Ahead of Ranji Trophy - Sakshi

టీమిండియా ఆల్‌రౌండర్‌ శివమ్‌ దుబే కరోనా బారిన పడ్డాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ముంబై జట్టుకు దుబే ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం కరోనా పరీక్షలు నిర్వహించగా దుబేతో పాటు జట్టు వీడియో ఎనలిస్ట్‌ గణేశ్‌కి పాజటివ్‌గా నిర్ధణైంది. దీంతో త్వరలో జరగనున్న రంజీ ట్రోఫీకు అతడు దూరమయ్యాడు. అతడి  స్ధానంలో సాయిరాజ్‌ పటేల్‌ని ఎంపికచేశారు.

ఈ విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్ ద్రువీకరించింది. అదే విధంగా బెంగాల్‌ జట్టులో 7గురు ఆటగాళ్లు కూడా కరోనా బారిన పడ్డారు. ఇక రంజీ ట్రోఫీ జనవరి 13నుంచి ప్రారంభం కానుంది. కాగా ఇప్పటికే కోల్‌కతాకు చేరుకున్న ముంబై జట్టు తమ తొలి మ్యాచ్‌లో మహారాష్ట్ర తో తలపడనుంది.

చదవండి: Mohammad Hafeez: పాకిస్తాన్‌కు బిగ్‌ షాక్‌.. మహ్మద్ హఫీజ్ సంచలన నిర్ణయం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement