
చివరి రంజీలో నిరాశపరిచిన సచిన్
భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన చివరి రంజీ మ్యాచ్లో అభిమానుల్ని నిరాశపరిచాడు. తాజా రంజీ సీజన్లో హర్యానాతో ఆదివారం ఆరంభమైన మ్యాచ్లో ముంబయికి సచిన్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన హర్యానాను ముంబై బౌలర్లు 134 పరుగులకు కుప్పకూల్చారు. అనంతరం ముంబై బ్యాటింగ్కు దిగడంతో సచిన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.
ముంబై ఓపెనర్లు ఇద్దరూ తొందరగా అవుటయ్యారు. ముంబై స్కోరు 32/2 వద్ద మాస్టర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. మాస్టర్ బ్యాటింగ్ చూసే సమయం ఆసన్నమైనందుకు అభిమానులు సంబరపడిపోయారు. సచిన్ వచ్చీరావడంతోనే ఓ ఫోర్ బాదాడు. అయితే ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ఏడో బంతికే పెవిలియన్ చేరాడు. మోహిత్ శర్మ బౌలింగ్లో బౌల్డవడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. త్వరలో వెస్టిండీస్తో జరిగే రెండు టెస్టుల సిరీస్ అనంతరం క్రికెట్ నుంచి వైదొలగనున్నట్టు సచిన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మాస్టర్ కెరీర్లో ఇదే చివరి రంజీ మ్యాచ్. రెండో ఇన్నింగ్స్లోనైనా సచిన్ అభిమానులను అలరిస్తాడేమో చూడాలి.