
సాక్షి, హైదరాబాద్: బెంగాల్ - ఛత్తీస్‌ఘడ్ మధ్య రాయిపూర్‌లో జరిగిన రంజీ మ్యాచ్‌లో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. బెంగాల్ పేస్ బౌలర్లు మహ్మద్ షమీ, అశోక్ దిండాలు స్లిప్‌లో ఏకంగా తొమ్మిది మందిని ఫీల్డింగ్ పెట్టి బౌలింగ్ చేశారు. 11 మంది సభ్యులే ఉండె క్రికెట్‌లో 9 మందిని స్లిప్‌లో ఫీల్డింగ్ పెట్టడం అత్యంత అరుదైతే.. బౌలర్, వికెట్ కీపర్‌తో కలిసి జట్టంతా సర్కిల్లోనే ఫీల్డింగ్ చేయడం మరో విశేషం. ఈ ఫోటోను మహ్మద్ షమీ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. ఇప్పుడు ఈ ఫోటో క్రికెట్ అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.
ఈ మ్యాచ్‌లో షమీ, దిండాలు రెచ్చిపోవడంతో ఛత్తీస్‌ఘడ్ రెండో ఇన్నింగ్స్ 259 పరుగులకే కుప్పకూలింది. అంతకు ముందు 529/7 స్కోరు వద్ద బెంగాల్ డిక్లెర్ చేయగా ఛత్తీస్‌ఘడ్ తొలి ఇన్నింగ్స్ 110 పరుగులకే ఆలౌటైంది. దీంతో బెంగాల్ ఇన్నింగ్స్ మిగిలి ఉండగానే 160 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment