
రాయ్‌పూర్: పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ (6/61) చెలరేగడంతో బెంగాల్ ఇన్నింగ్స్, 160 పరుగుల తేడాతో ఛత్తీస్‌గఢ్‌ను చిత్తు చేసింది. ఫాలోఆన్‌లో రెండో ఇన్నింగ్స్ ఆడిన ఛత్తీస్‌గఢ్ 259 పరుగులకు ఆలౌటైంది. అభిమన్యు చౌహాన్ (115) సెంచరీతో పోరాడినా లాభం లేకపోయింది. తన 100వ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టిన అశోక్ దిండాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
న్యూఢిల్లీ: రైల్వేస్‌లో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ ఇన్నింగ్స్, 105 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫాలోఆన్ ఆడుతూ రైల్వేస్ రెండో ఇన్నింగ్స్‌లో 206 పరుగులకే కుప్పకూలింది.
మైసూర్: కర్ణాటక ఇన్నింగ్స్, 121 పరుగుల తేడాతో అస్సాంను చిత్తుగా ఓడించింది. ఫాలోఆన్‌లో అస్సాం తమ రెండో ఇన్నింగ్స్‌లో 203 పరుగులకు ఆలౌటైంది. వినయ్ కుమార్ 4 వికెట్లు... గౌతమ్, మిథున్ చెరో 3 వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ తీశారు.
నడియాడ్: డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ ఉత్కఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 4 వికెట్లతో కేరళను ఓడించింది. 105 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని అతి కష్టమ్మీద అందుకుంది. ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. రాజస్థాన్ – జార్ఖండ్... తమిళనాడు – త్రిపుర... హిమాచల్‌ప్రదేశ్ – గోవా... ముంబై – మధ్యప్రదేశ్ మధ్య జరిగిన మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి.
Comments
Please login to add a commentAdd a comment