ధర్మశాల: పంజాబ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో హిమాచల్ ప్రదేశ్ బ్యాట్స్‌మన్ ప్రశాంత్ చోప్రా (363 బంతుల్లో 338; 44 ఫోర్లు, 2 సిక్స్‌లు) ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ఫలితంగా ఆట రెండో రోజు హిమాచల్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 148 ఓవర్లలో 8 వికెట్లకు 729 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. తన ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 271తో బ్యాటింగ్ కొనసాగించిన ప్రశాంత్ 318 బంతుల్లో ట్రిపుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
పారస్ డోగ్రా (99) ఒక పరుగు తేడాతో సెంచరీని కోల్పోగా... అంకుశ్ బైన్స్ (80; 12 ఫోర్లు), రిషి ధావన్ (49; 7 ఫోర్లు) ప్రశాంత్‌కు సహకరించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 110 పరుగులు చేసింది. శనివారం తన పుట్టిన రోజు జరుపుకున్న 25 ఏళ్ల ప్రశాంత్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో పుట్టిన రోజున ట్రిపుల్ సెంచరీ చేసిన మూడో బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు.
గతంలో ఎంసీసీ బ్యాట్స్‌మన్ కొలిన్ కౌడ్రీ (1962లో సౌత్ ఆస్ట్రేలియాపై 307), ఢిల్లీ క్రికెటర్ రమణ్ లాంబా (1995లో హిమాచల్‌ప్రదేశ్‌పై 312) మాత్రమే ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా రంజీ ట్రోఫీ చరిత్రలో ప్రశాంత్‌ది పదో అత్యధిక వ్యక్తిగత స్కోరు. అంతేకాకుండా ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి హిమాచల్‌ప్రదేశ్ బ్యాట్స్‌మన్‌గా అతను గుర్తింపు పొందాడు.
గంభీర్, రాణా సెంచరీలు
అస్సాంతో జరుగుతున్న గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ (136 బ్యాటింగ్; 21 ఫోర్లు), ఐపీఎల్ స్టార్ నితీశ్ రాణా (110; 18 ఫోర్లు) సెంచరీలు చేశారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఢిల్లీ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 269 పరుగులు చేసింది. అంతకుముందు ఇషాంత్ శర్మ (5/38) ధాటికి అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 258 పరుగులకు ఆలౌటైంది.
Comments
Please login to add a commentAdd a comment