విహారి, ప్రశాంత్‌ శతకాలు | Vihari and Prashta centuries | Sakshi
Sakshi News home page

విహారి, ప్రశాంత్‌ శతకాలు

Published Tue, Oct 24 2017 11:49 PM | Last Updated on Tue, Oct 24 2017 11:49 PM

Vihari and Prashta centuries

సాక్షి, విజయనగరం: ఆంధ్ర బ్యాట్స్‌మెన్‌ చెలరేగడంతో ఒడిషాతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో జట్టుకు శుభారంభం లభించింది. కెప్టెన్‌ హనుమ విహారి (248 బంతుల్లో 143 బ్యాటింగ్‌; 17 ఫోర్లు, 1 సిక్స్‌), డీబీ ప్రశాంత్‌ (270 బంతుల్లో 127; 17 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకాలు బాదడంతో మంగళవారం మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది.

కేఎస్‌ భరత్‌ (3) అవుటైన తర్వాత విహారి, ప్రశాంత్‌ రెండో వికెట్‌కు 270 పరుగులు జోడించడం విశేషం. బయటి వేదికపై తొలి రెండు మ్యాచ్‌ లలో ఆకట్టుకునే ప్రదర్శన చేసిన ఆంధ్రకు ఈ సీజన్‌లో సొంతగడ్డపై ఇదే తొలి మ్యాచ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement