బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ ఎ.బాలాజీ తెలిపిన వివరాల ప్రకారం... ఫతేదర్వాజా ప్రాంతానికి చెందిన ఫర్జానా బేగంకు ఎనిమిదేళ్ల కూతురు ఉంది. భర్త చనిపోవడంతో ఇళ్లల్లో పని చేస్తూ జీవిస్తోంది.
వీరి ఇంటి పక్కనే నివాసముండే సిరాజ్ (40) ఈ నెల 2వ తేదీన బాలికకు బిస్కెట్లు ఇప్పిస్తానని ఆశచూపి ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న ఫర్జానాబేగం బుధవారం హుస్సేనీఆలం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు వెంటనే బాలికను ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న సిరాజ్‌ను పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.