మార్చి 31 నుంచి 2023 ఐపీఎల్ సీజన్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌ను ఫోర్ టైమ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ఢీకొట్టనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ ఐకానిక్ స్టేడియంలో రాత్రి 7:30 గంటకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది.
కాగా, ప్రతి సీజన్‌లో దేశ, విదేశీ స్టార్లతో కలకలలాడే క్రికెట్ పండుగ ఈసారి కాస్త కలావిహానంగా మారనుంది. గాయాల కారణంగా చాలామంది స్టార్లు సీజన్ మొత్తానికే దూరం కానున్నారు. కొందరేమో లీగ్ ఆరంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదు. గాయాల కారణంగా ఐపీఎల్ 16వ ఎడిషన్ మొత్తానికే దూరం కానున్న స్టార్ ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది...
జస్ప్రీత్ బుమ్రా (ముంబై ఇండియన్స్)
రిషబ్ పంత్ (ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్)
కైల్ జేమీసన్ (చెన్నై సూపర్ కింగ్స్)
విల్ జాక్స్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)
జై రిచర్డ్‌సన్ (ముంబై ఇండియన్స్)
అన్రిచ్ నోర్జే (ఢిల్లీ క్యాపిటల్స్)
ప్రిసిద్ధ్ కృష్ణ (రాజస్తాన్ రాయల్స్)
జానీ బెయిర్‌స్టో (పంజాబ్ కింగ్స్)
సర్ఫరాజ్ ఖాన్ (ఢిల్లీ క్యాపిటల్స్), ముకేశ్ చౌదరీ (చెన్నై సూపర్ కింగ్స్), మొహిసిన్ ఖాన్ (లక్నో సూపర్ జెయింట్స్), శ్రేయస్ అయ్యర్ (కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్), జోష్ హాజిల్‌వుడ్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), రజత్ పాటిదార్ (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు) ఐపీఎల్-2023లో పాల్గొనేది లేనిది తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment