ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించి ఆటగాళ్ల రిటెన్షన్ జాబితాను కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. అన్ని ఫ్రాంచైజీలు ఊహించినట్టుగానే తాము అట్టిపెట్టుకునే ఆటగాళ్ల జాబితాను సమర్పించాయి. అయితే కొన్ని ఫ్రాంచైజీలు ఆసక్తికరంగా తమ కెప్టెన్లను వదిలేశాయి.
ముందు నుంచి ప్రచారం జరిగినట్టుగా ఢిల్లీ (రిషబ్ పంత్), లక్నో (కేఎల్ రాహుల్), కేకేఆర్ (శ్రేయస్ అయ్యర్), పంజాబ్ కింగ్స్ (శిఖర్ ధవన్), ఆర్సీబీ (ఫాఫ్ డుప్లెసిస్) తమ కెప్టెన్లను వేలానికి వదిలేశాయి. నవంబర్ చివరి వారంలో జరుగబోయే మెగా వేలంలో ఈ ఐదుగురు కెప్టెన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కారణాలు ఏవైనా ఆయా ఫ్రాంచైజీలు కెప్టెన్లను వేలానికి వదిలేయడం ఆసక్తికరంగా మారింది.
కెప్టెన్లను వదిలేసిన ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితా..
కోల్‌కతా నైట్‌రైడర్స్
రింకూ సింగ్- రూ. 13 కోట్లు
వరుణ్ చక్రవర్తి- రూ. 12 కోట్లు
సునీల్ నరైన్- రూ. 12 కోట్లు
ఆండ్రీ రసెల్- రూ. 12 కోట్లు
హర్షిత్ రాణా- రూ. 4 కోట్లు
రమన్‌దీప్ సింగ్- రూ. 4 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్
అక్షర్ పటేల్- రూ. 16.5 కోట్లు
కుల్దీప్ యాదవ్- రూ. 13.25 కోట్లు
ట్రిస్టన్ స్టబ్స్- రూ. 10 కోట్లు
అభిషేక్ పోరెల్- రూ. 4 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్
నికోలస్ పూరన్- రూ. 21 కోట్లు
రవి బిష్ణోయ్- రూ. 11 కోట్లు
మయాంక్ యాదవ్- రూ. 11 కోట్లు
మొహిసన్ ఖాన్- రూ. 4 కోట్లు
ఆయుశ్ బదోని- రూ. 4 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
విరాట్ కోహ్లి- రూ. 21 కోట్లు
రజత్ పాటిదార్- రూ. 11 కోట్లు
యశ్ దయాల్- రూ. 5 కోట్లు
పంజాబ్ కింగ్స్
శశాంక్ సింగ్- రూ. 5.5 కోట్లు
ప్రభ్‌మన్‌సిమ్రన్ సింగ్- రూ. 4 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment