Virat Kohli Moves to 7th Spot in Latest ICC Test Rankings - Sakshi
Sakshi News home page

ICC Rankings: స్థిరంగా రోహిత్‌.. దూసుకెళ్తున్న కోహ్లి

Published Wed, Jan 19 2022 6:14 PM | Last Updated on Wed, Jan 19 2022 7:34 PM

Virat Kohli Moves To 7th Spot In Latest ICC Test Rankings - Sakshi

దుబాయ్‌: ఇటీవ‌లే టీమిండియా టెస్ట్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విరాట్ కోహ్లి తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో పూర్వ వైభవం దిశగా దూసుకెళ్తున్నాడు. తాజా టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా పరిమిత ఓవర్ల సారధి రోహిత్ శ‌ర్మ 8 రేటింగ్ పాయింట్లు కోల్పోయినప్పటికీ.. ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, దక్షిణాఫ్రికాతో మూడో టెస్ట్‌లో అద్భుత శతకంతో చెలరేగిన రిషబ్‌ పంత్‌ 10 స్థానాలు మెరుగుపర్చుకుని 14వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. 


మరోవైపు యాషెస్‌లో వరుస సెంచరీలతో సత్తా చాటిన ఆసీస్‌ ఆటగాడు ట్రావిస్‌ హెడ్‌ 7 స్థానాలు ఎగబాకి రోహిత్‌తో పాటు సంయుక్తంగా ఐదో స్థానంలో నిలువగా, లబూషేన్‌ టాప్‌లో, రూట్‌, విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌లు వరుసగా 2, 3, 4 స్థానాల్లో నిలిచారు. 

ఇక బౌల‌ర్ల విషయానికొస్తే.. అశ్విన్(839 రేటింగ్‌ పాయింట్లు) త‌న రెండో స్థానాన్ని నిల‌బెట్టుకోగా, బుమ్రా 763 పాయింట్లు సాధించి టాప్-10లోకి చేరాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్‌లో పర్వాలేదనిపించిన బుమ్రా.. 3 స్థానాలు మెరుగుపర్చుకుని 10వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.  ఈ జాబితాలో పాట్‌ కమిన్స్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, ఇండియాతో సిరీస్‌లో రాణించిన రబాడ 2 స్థానాలు ఎగబాకి మూడో ప్లేస్‌కు చేరుకున్నాడు. 
చదవండి: అతనో చేత కాని బౌలర్‌.. నన్ను ఔట్ చేసుకోలేక ఏడ్చేవాడు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement