ICC Test Ranikngs: ఆస్ట్రేలియా స్టార్ ట్రవిస్ హెడ్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపాడు. ఇంగ్లండ్‌తో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో రాణిస్తున్న ఈ లెఫ్టాండ్ బ్యాటర్ నంబర్ 1 స్థానానికి గురిపెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా ప్రకటించిన టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపరచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు.
ఇక న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా.. టాప్-10లో టీమిండియా నుంచి రిషభ్ పంత్ ఒక్కడే నిలకడగా కొనసాగుతున్నాడు. మరోవైపు.. టీమిండయా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక స్థానం దిగజారి 13వ ర్యాంకుకు పడిపోయాడు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్ల 14వ స్థానంలో కొనసాగుతున్నాడు.
అశ్విన్ నంబర్ 1గానే.. జడ్డూ మాత్రం
ఇదిలా ఉంటే.. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా నుంచి పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా(9), స్పిన్ బౌలర్ రవీంద్ర జడేజా(10) ఒక్కో స్థానం చేజార్చుకుని టాప్-10లో కొనసాగుతున్నారు.
విండీస్‌తో సిరీస్‌లో బిజీ
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో ఘోర ఓటమి తర్వాత టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉంది. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లో భాగంగా రోహిత్ సేన విండీస్‌తో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. జూలై 12 నుంచి ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది.
ఐసీసీ టెస్టు బ్యాటింగ్ తాజా ర్యాంకింగ్స్: టాప్-5లో ఉన్నది వీళ్లే
1. కేన్ విలియమ్సన్- న్యూజిలాండ్- 883 పాయింట్లు
2. ట్రవిస్ హెడ్- ఆస్ట్రేలియా- 874 పాయింట్లు
3. బాబర్ ఆజం- పాకిస్తాన్- 862 పాయింట్లు
4. స్టీవ్ స్మిత్- ఆస్ట్రేలియా- 855 పాయింట్లు
5. మార్నస్ లబుషేన్- ఆస్ట్రేలియా- 849 పాయింట్లు.
చదవండి: జట్టు నుంచి తప్పించడం కంటే కూడా అదే ఎక్కువగా బాధిస్తోంది: టీమిండియా స్టార్
Ind Vs WI: ఛీ.. మరీ ఘోరంగా ఉంది.. నాకైతే!
Comments
Please login to add a commentAdd a comment