బౌండరీ లైన్‌పై బూమ్రా అద్బుత విన్యాసం
జోహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో భారత ఆటగాడు జస్ర్పిత్ బూమ్రా తన ఫీల్డింగ్‌తో మైమరిపించాడు. సఫారీ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ కొట్టిన భారీ షాట్‌ను ఆపే యత్నంలో బూమ్రా బౌండరీ లైన్‌పై చేసిన ఫీట్ అబ్బురపరిచింది. దక్షిణాఫ్రికా లక్ష్య ఛేదనలో భాగంగా భారత బౌలర్ హార్దిక్ పాండ్యా వేసిన ఏడో ఓవర్ తొలి బంతిని మిల్లర్ మిడిల్ అండ్ లెగ్ మీదుగా షాట్ కొట్టాడు. అయితే ఆ సమయంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బూమ్రా గాల్లోకి ఎగురుతూ బంతిని పట్టుకున్నాడు.
కాగా, బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో బంతిని విసిరేసి బౌండరీ లైన్‌పై పడ్డాడు. కానీ అది సిక్సర్‌గా థర్డ్ అంపైర్ ప్రకటించాడు. ఇటీవల క్రికెట్‌లో సరళీకరించిన నిబంధనల ప్రకారం తొలుత ఒకసారి బౌండరీ లైన్ తాకి ఆపై గాల్లో క్యాచ్ పట్టి విసిరేసినా అది సిక్సర్‌గానే పరిగణిస్తారు. దాంతో ఒకింత నిరాశ అనిపించనప్పటికీ, బూమ్రా అసాధారణ రీతిలో బంతిని అందుకోవడం క్రికెట్ అభిమానుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో విజయ డంకా మోగించింది.
Comments
Please login to add a commentAdd a comment