న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్లకు సంబంధించిన ఓ ఇన్‌స్టా పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆ పోస్ట్‌లో ఉన్న భారత ఆటగాళ్ల ఫొటోలు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా టీమిండియా టాప్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ ఫొటోలను చూసి ఫ్యాన్స్ నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఇంతకీ ఆ ఫొటోల్లో ఏముందో తెలుసుకోవాలంటే ఆ ఇన్‌స్టా పోస్ట్‌పై ఓ లుక్కేయండి. టీమిండియా క్రికెటర్లు ఫిట్‌నెస్ కోల్పోయి ఫ్యాట్‌గా మారితే ఎలా ఉంటారో ఊహించుకుని ఓ అభిమాని సరదాగా ఫొటో షాప్ ఫిల్టర్ సాయంతో వారి ముఖ కవళికలను మార్చాడు.
దీంతో ఫిట్‌గా ఉండే మన క్రికెటర్లు 30 ఏళ్లు దాటిన తర్వాత సాధారణ ప్రజలు పొట్టలేసుకుని, ఎలా అన్‌ఫిట్‌గా ఉంటారో అలా కనిపించారు. ముఖాలు వాచి పోయి అంకుల్స్‌ను తలపిస్తున్నారు. ఈ ఫొటోలను చూసి అభిమానులు తెగ నవ్వుకుంటున్నారు. ఎప్పుడూ ఫిట్‌గా కనిపించే మన క్రికెటర్లకు ఏంటీ దుస్థితి అని కామెంట్లు పెడుతున్నారు. కొందరైతే ఏదో ఒక రోజు మనోళ్లు ఇలానే తయారవుతారని గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు.. ఆతిథ్య దేశంతో ఐదు టెస్ట్‌ల సిరీస్ ఆడుతుంది. ఇప్పటికే టీమిండియా రెండో టెస్ట్‌లో చిరస్మరణీయవిజయం సాధించి 1-0తో ఆధిక్యంలో నిలిచింది. లీడ్స్ వేదికగా బుధవారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్ కోసం ఇరు జట్లు సమాయత్తం అవుతున్నాయి. హెడింగ్లే స్టేడియంలో మనోళ్లు ఆదివారం జరిగిన తొలి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నారు. కెప్టెన్ కోహ్లి, రోహిత్ శర్మ, రహానే, కేఎల్ రాహుల్, పంత్‌తో పాటు పేసర్లు షమీ, బుమ్రా, స్పిన్నర్లు అశ్విన్, జడేజా నెట్స్‌లో చమటోడ్చారు.
చదవండి: మీకు మేమున్నాం, చెలరేగి ఆడండి.. అఫ్గాన్ క్రికెటర్లకు తాలిబన్ల భరోసా
Comments
Please login to add a commentAdd a comment