స్పిన్నర్లు తేలిపోయారు..!
కీలకమైన ఫైనల్ పోరులో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ జోరు కొనసాగిస్తున్నారు. ఓవల్‌లోని ఫ్లాట్ పిచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు తీసుకొని కెప్టెన్ కోహ్లి బరిలోకి దిగడం అస్సలు ఫలితాన్ని ఇవ్వలేదు. అయితే, కోహ్లికి ఇంతకుమించి పెద్ద ప్రత్యామ్నాయం లేకపోవడంతో అతను స్పిన్నర్ల మీద ఎక్కువ ఆధారపడినట్టు కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఉమేశ్ యాదవ్ అందుబాటులో ఉండి ఉంటే పరిస్థితి కాస్తా మెరుగ్గా ఉండేదని నిపుణుల అభిప్రాయం. కోహ్లి ప్రయోగించిన స్పిన్నర్లు తేలిపోయారు.
బుమ్రా కూడా భారీగా పరుగులు సమర్పించకున్నాడు. భువనేశ్వర్, హార్ధిక్ పాండ్యా మాత్రమే పర్వాలేదనిపించారు. 40 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసిన పాక్ ఓ దశలో 350 పరుగులను చేరుకుంటుందా? అనిపించింది. అయితే, కానీ చివరకు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 338 పరుగులు చేసింది. పటిష్టంగా ఉన్న టీమిండియా బ్యాట్స్‌మెన్ జోరు ప్రదర్శిస్తే.. ఈ లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద కష్టమేమీ కాదని భారత అభిమానులు అభిప్రాయపడుతున్నారు.