
తిరువనంతపురు: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న ఐదో వన్డేలో వెస్టిండీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది విండీస్. విండీస్ ఓపెనర్ కీరన్ పావెల్ డకౌట్‌గా పెవిలియన్ చేరగా, ఫస్ట్ డౌన్ ఆటగాడు సాయ్ హోప్ సైతం పరుగులేమీ చేయకుండా నిష్క్రమించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ తొలి ఓవర్‌లోనే పావెల్ వికెట్ చేజార్చుకుంది.
భువనేశ్వర్ కుమార్ మొదటి ఓవర్ నాల్గో బంతికి ధోనికి క్యాచ్ ఇచ్చిన పావెల్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం రెండో ఓవర్ వేసిన బూమ్రా నాల్గో బంతికి హోప్‌ను ఔట్ చేశాడు. బూమ్రా బౌలింగ్‌లో హోప్ బౌల్డ్ అయ్యాడు. దాంతో రెండు పరుగులకే రెండు ప్రధాన వికెట్లను విండీస్ కోల్పోయింది.
Comments
Please login to add a commentAdd a comment