మొత్తానికి కేటీఆర్‌ ఫిదా అయ్యాడు | KTR praises Thaman for Tholi Prema music | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 11 2018 8:19 AM | Last Updated on Sun, Feb 11 2018 12:37 PM

KTR praises Thaman for Tholi Prema music - Sakshi

కేటీఆర్‌-ఎస్‌ఎస్‌ థమన్‌ (ఫైల్‌ ఫోటోలు)

సాక్షి, సినిమా : తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సినిమాల పట్ల ఆసక్తికనబరుస్తారన్న విషయం తెలిసిందే. సినీ సెలబ్రిటీలతో స్నేహపూర్వకంగా ఉండే ఆయన.. తరచూ సినిమాలు చూస్తూ తన అభిప్రాయాన్ని కూడా సోషల్‌ మీడియాలో తెలియజేస్తుంటారు. తాజాగా ఆయన తొలిప్రేమ చిత్రాన్ని చూసి ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశారు.

‘‘శనివారం రాత్రి అద్భుతంగా గడిచింది. తొలిప్రేమ లాంటి ఓ సున్నితమైన ప్రేమకథను చూశాను. దర్శకుడు వెంకీ అట్లూరి బాగా తెరకెక్కించాడు. రాశీ ఖన్నా, వరుణ్‌ తేజ్‌ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ముఖ్యంగా మంచి సాహిత్యం.. దానికి థమన్‌ టెర్రిఫిక్‌ మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ ఆకట్టుకున్నాయి’’ అని కేటీఆర్‌ గత రాత్రి ట్వీట్‌ చేశారు. 

దీనికి స్పందించిన థమన్‌ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ రీట్వీట్‌ చేయగా.. గ్రేట్‌ జాబ్‌ అంటూ కేటీఆర్‌ మరో ట్వీట్‌తో అభినందన తెలియజేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement