IT Minister KTR
-
బయ్యారం స్టీల్‌ప్లాంట్‌పై కుట్రలు చేశారు
-
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన
-
స్టీల్ బ్రిడ్జి.. నగరానికే తలమానికం
ముషీరాబాద్: ఇందిరా పార్కు నుంచి వీఎస్టీ వరకు 2.6 కిలోమీటర్ల మేర రూ.440 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఎలివేటెడ్ స్టీల్ బ్రిడ్జి నగరానికే తలమానికం కానుందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. శనివారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులతో కలిసి స్టీల్ బ్రిడ్జి పనులను ఆయన పరిశీలించారు. పనులు నత్త నడకన సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీలోపు పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే రాత్రింబవళ్లూ పని చేయాలని కేటీఆర్ సూచించారు. ఇందిరాపార్కు చౌరస్తా నుంచి కొద్ది దూరం నడుచుకుంటూ వచ్చి పనులను పరిశీలించారు. అనంతరం వీఎస్టీ వద్ద నిర్మితమవుతున్న ర్యాంప్‌పైకి ఎక్కి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే ట్రాఫిక్‌ను మళ్లించి నిర్మాణ పనులను వేగవంతం చేస్తామన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్‌ను తగ్గించి ముషీరాబాద్, ఖైరతాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల ప్రజల సౌకర్యార్థం స్టీల్ బ్రిడ్జీని చేపడుతున్నామని తెలిపారు. నగర పౌరులకు ట్రాఫిక్ రద్దీ సమస్యకు ఉపశమనం లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. రిటైనింగ్ వాల్ పనుల పరిశీలన.. స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో పాటు ఎస్ఎన్డీపీలో భాగంగా చేపట్టిన హుస్సేన్‌సాగర్ నాలా రిటైనింగ్ వాల్ పనులను మంత్రి కేటీఆర్ సమీక్షించారు. హుస్సేన్‌సాగర్ వరద నీటి ద్వారా లోతట్టు ప్రాంత ప్రజలకు భవిష్యత్తులో ముంపు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రిటైనింగ్ వాల్ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం చిక్కడపల్లిలోని కూరగాయల మార్కెట్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. చేపల మార్కెట్ కోసం డిజైన్ రూపొందించండి.. దేశంలోనే ఫ్రెష్ ఫిష్ మార్కెట్ ఎక్కడ ఉందంటే రాంనగర్‌లోనే ఉందనే విధంగా చేపల మార్కెట్‌ను మంచి డిజైన్ చేసి వారం రోజుల్లో తీసుకురావాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ తనయుడు ముఠా జైసింహకు మంత్రి కేటీఆర్ బాధ్యతలను అప్పగించారు. జాగా నేను ఇప్పిస్తా.. డబ్బులు ఇప్పిస్తా వారం రోజుల్లో డిజైన్ చేసి తీసుకురా అని జైసింహతో చెప్పారు. ఈఎన్సీలు శ్రీధర్, జియావుద్దీన్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. -
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ నియామకాన్ని రద్దు చేస్తూ కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి అప్పగిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన క్రమంలో ఈ కేసులో దొంగల ముసుగులు తొలిగాయన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. హైకోర్టు తీర్పు కేసీఆర్ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొనటంపై కౌంటర్ ఇచ్చారు. కుట్ర కేసు జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకు కిషన్‌రెడ్డికి సంబరమా? అంటూ ప్రశ్నించారు. సీబీఐ అంటే సెంట్రల్ బీజేపీ ఇన్వెస్టిగేషన్ అయ్యిందని ఆరోపించారు. హైదబారాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు మంత్రి కేటీఆర్. ‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొంగల ముసుగులు తొలిగాయి. స్కాంలో స్వామీజీలతో సంబంధం లేదన్నవారు సంబరాలు చేసుకుంటున్నారు. సంబంధం లేదన్నవారు దొంగలను భుజాలపై మోస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి అప్పగిస్తే బీజేపీ సంబురాల మర్మమేంటి? దొంగలకు నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్టులకు సిద్ధమా? ఆపరేషన్ లోటస్ బెడిసికొట్టి అడ్డంగా దొరికారు. నేరం చేసిన వాళ్లు ప్రజాకోర్టులో తప్పించుకోరు. కలుగులో దాక్కున్న దొంగలు మెల్లిగా బయటకు వస్తున్నారు.’ అని బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్. ఇదీ చదవండి: హైకోర్టు తీర్పు కేసీఆర్ సర్కార్‌కు చెంపపెట్టు: కిషన్‌రెడ్డి -
మోదీ మిత్రుల కోసమే పన్ను తగ్గింపు!
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సామాన్యుల కోసం కాకుండా కార్పొరేట్ల కోసమే పనిచేస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పన్నులు, సెస్సుల రూపంలో పెట్రో ఉత్పత్తుల ధరలను అడ్డగోలుగా పెంచేసిన కేంద్రం.. కార్పొ రేట్ చమురు కంపెనీలకు మాత్రం విండ్‌ఫాల్ టాక్సులు తగ్గించడం ఏమిటని నిలదీశారు. ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పెట్రో ఉత్పత్తులపై సెస్సులు, పన్నులు తగ్గించకుండా.. జనం జేబులకు చిల్లుపెట్టడమే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని విమర్శించారు. కార్పొరేట్ చమురు కంపెనీలకు మిగులుతున్న సొమ్ములు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో ప్రజలకు తెలుసని వ్యాఖ్యానించారు. వాస్తవానికి తెలంగాణ వంటి రాష్ట్రాలు 2014 నుంచి పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ను ఏమాత్రం పెంచలేదని.. అయినా రాష్ట్రాలే వ్యాట్ తగ్గించడం లేదంటూ మోదీ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా దేశ ప్రజలను తప్పుదోవ పట్టించిందని మండిపడ్డారు. సెస్‌ల పేరుతో రూ.30లక్షల కోట్లు కొల్లగొట్టి, రాష్ట్రాల పన్నుల వాటాను ఎగవేసిన కేంద్రం.. పైగా రాష్ట్రాలపైనే నిందలు వేస్తోందని విమర్శించారు. కేంద్రం సెస్సుల రూపంలో దోచుకున్న రూ.30 లక్షల కోట్లను వినియోగంలోకి తెస్తే.. లీటర్ పెట్రోల్ రూ.70, డీజిల్‌ను రూ.60కే అందించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీల లాభం కోసమే.. రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని బూచిగా చూపి బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలను దోచుకుందని కేటీఆర్ ఆరోపించారు. రష్యా నుంచి తక్కువ ధరకు ముడిచమురు కొంటున్నట్టు మోదీ ప్రభుత్వం గొప్పలు చెప్పిందని.. కానీ ఆ చమురును దేశీయ అవసరాలకు వాడకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసి కార్పొరేట్ కంపెనీలు భారీగా లాభం ఆర్జించాయని వివరించారు. ఇలా కంపెనీలకు అప్పనంగా వచ్చిన సొమ్ముపై మోదీ ప్రభుత్వం పన్నులు తగ్గించిందని.. దీని వెనుక మోదీ కార్పొరేట్ మిత్రులకు చెందిన రెండు కంపెనీలకు లబ్ధి చేకూర్చే ఉద్దే శం ఉందని ఆరోపించారు. చవక చమురు లాభం దేశ ప్రజలకు అందకుండా పోయిందన్నారు. బీజేపీవి క్షుద్ర రాజకీయాలు మోదీప్రభుత్వం దేశప్రగతి, ప్రయోజనాలను పట్టించుకోకుండా క్షుద్ర రాజకీయాలతో కాలం గడుపుతోందని కేటీఆర్ విమర్శించారు. పెట్రో ధరల తగ్గింపు విషయంలో సంకుచిత రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టాలని.. ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. పన్నులు, సెస్సులతో పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచిన కేంద్రం.. ఈ నెపాన్ని తెలంగాణ వంటి రాష్ట్రాలపైకి నెట్టడాన్ని ఆపాలని సూచించారు. (చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడు నందుపై మరో చీటింగ్ కేసు ) -
హైదరాబాద్‌లో ఏడబ్ల్యూఎస్ భారీ పెట్టుబడులు, ఏడాదికి 48వేల ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు చెందిన క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీస్‌లో అగ్రగామి అమెజాన్ వెబ్ సర్వీసెస్ (ఏడబ్ల్యూఎస్) రీజియన్ కార్యకలాపాలను ఆసియా పసిఫిక్ (హైదరాబాద్‌లో) ఆవిష్కరించింది. దేశంలో రెండవ మౌలిక సదుపాయాల ఏడబ్ల్యూఎస్ రీజియన్‌ను మంగళవారం లాంచ్ చేసింది. రాబోయే ఎనిమిదేళ్లలో (2030) 4.4 బిలియన్ డాలర్ల (సుమారు రూ.36,300 కోట్లు) పెట్టుబడులను కంపెనీ ప్రకటించింది. తద్వారా సంవత్సరానికి 48వేల ఫుల్‌టైం ఉద్యోగాలు లభించనున్నాయని అంచనా. అంతేకాదు 2030 నాటికి సుమారుగా 7.6 బిలియన్ల డాలర్ల మేర భారతదేశ స్థూల జాతీయోత్పత్తికి తోడ్పాటునిస్తుందని కూడా భావిస్తున్నారు. (బ్లూటిక్ వెరిఫికేషన్ ఫీజు: మరోసారి బ్రేక్, ఎందుకంటే?) హైదరాబాద్ రీజియన్ ప్రారంభండిజిటల్ ఇండియాకు మద్దతు ఇస్తుందని అమెజాన్ డేటా సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ కళ్యాణరామన్ చెప్పారు. 2011లో తమ తొలి కార్యాలయాన్ని ప్రారంభించినప్పటి నుండి దేశంలో దీర్ఘకాలిక పెట్టుబడిలో భాగమని ఒక ప్రకటనలో తెలిపింది. డేటా అనలిటిక్స్, సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో సహా ఆవిష్కరణలను నడపడానికి కస్టమర్లు అధునాతన ఏడబ్ల్యూఎస్ టెక్నాలజీలకు యాక్సెస్ లభిస్తుందని కంపెనీ వెల్లడించింది. (వాట్సాప్ అదిరిపోయే ఫీచర్లు: పోల్స్ ఫీచర్ ఇంకా...!) ఇవీ చదవండి:Google Layoffs ఉద్యోగులకు షాకింగ్ న్యూస్: 10 వేలమంది ఇంటికే! Twitter Hirings ఎట్టకేలకు శుభవార్త చెప్పిన మస్క్: ఇండియన్ టెకీలకు గుడ్ న్యూస్ డేటా సెంటర్లను విస్తరణకు సంబంధించి ఏడబ్ల్యూఎస్ పెట్టుబడులను కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్రిలియన్ డాలర్ల డిజిటల్ ఇండియాకు సాధనకు ఇది ఖచ్చితంగా సహాయపడుతుందని అన్నారు. దేశంలో ప్రగతిశీల డేటాసెంటర్ హబ్‌గా తెలంగాణ స్థానాన్ని బలోపేతం చేసేలా హైదరాబాద్‌లోని ఏడబ్ల్యూఎస్ రీజియన్‌లో సుమారు రూ. 36,300 కోట్ల పెట్టుబడులపై తెలంగాణా ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కాగా కంపెనీ తమ తొలి ఏడబ్ల్యూఎస్ రీజియన్‌ను 2016లో ముంబైలో ప్రారంభించింది. The future starts today! The AWS Asia Pacific (Hyderabad) Region is now open! 🎉 This is the second region in India joining the Mumbai region to offer customers more choice & flexibility to leverage advanced cloud technologies. https://t.co/8LmlI4U1P0#IndiaBuildsOnAWS pic.twitter.com/BwnabfAJRm — AWS Cloud India (@AWSCloudIndia) November 22, 2022 -
ఐటీలో 5 లక్షల కొలువులు
హైదరాబాద్: దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) సర్వీసుల రంగం, స్టార్టప్‌లు వచ్చే ఏడాది భారీ స్థాయిలో నియామకాలు చేపట్టనున్నాయి. 2019లో దాదాపు 5 లక్షల మందిని రిక్రూట్ చేసుకునే అవకాశం ఉందని ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ చైర్మన్ టి.వి.మోహన్‌దాస్ పాయ్ తెలియజేశారు. ఫ్రెషర్లకు డిమాండ్ పెరుగుతోందని చెప్పారాయన. దాదాపు ఏడేళ్ల పాటు స్థిరంగా ఉండిపోయిన ఎంట్రీ స్థాయి ఉద్యోగుల జీతభత్యాల ప్యాకేజీలు గతేడాది సుమారు 20 శాతం మేర పెరిగాయని తెలిపారు. 2018 సమీక్ష, 2019 అంచనాల మీద మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. ‘2018లో హెచ్1బీ వీసాల నిబంధనలు కఠినతరమయ్యాయి. దీంతో భారత ఐటీ కంపెనీలు జపాన్, ఆగ్నేయాసియా దేశాలపై మరింత దృష్టి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ ఐటీ సేవల రంగం మళ్లీ వృద్ధి బాట పడుతోంది. మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీ మంత్రి కేటీఆర్ మార్కెటింగ్ నైపుణ్యాలతో మరిన్ని కొత్త కంపెనీలు హైదరాబాద్‌కి వస్తున్నాయి. హైదరాబాద్ హాట్ డెస్టినేషన్‌గా మారింది‘ అని పాయ్ పేర్కొన్నారు. స్టార్టప్‌లలో 2 లక్షల ఉద్యోగాలు.. దేశీ స్టార్టప్ సంస్థలు వచ్చే ఏడాది సుమారు 2,00,000 మంది ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందని పాయ్ తెలిపారు. స్టార్టప్స్ గతేడాది 1,50,000 మందిని నియమించుకున్నాయని.. ప్రస్తుతం వీటిల్లో ఉద్యోగుల సంఖ్య 6,00,000 పైచిలుకు ఉంటుందని ఆయన తెలిపారు. ఐటీ సర్వీసులు, స్టార్టప్స్ కలిస్తే 4.5 లక్షలు – 5 లక్షల దాకా నియామకాలు ఉండొచ్చన్నారు. 2018లో ఇవి రెండూ కలిపి సుమారు 3.5 లక్షల నుంచి 4 లక్షల మంది దాకా ఉద్యోగులను రిక్రూట్ చేసుకున్నట్లు వివరించారు. ‘స్టార్టప్‌లు కూడా పెద్ద కంపెనీలుగా ఎదుగుతున్నాయి. ప్రస్తుతం దేశీయంగా 39,000 పైచిలుకు స్టార్టప్స్ ఉన్నాయి. ప్రతీ సంవత్సరం కొత్తగా 5,000 ఏర్పడుతున్నాయి. ఇవి హైరింగ్ చేపట్టినప్పుడు ఇంజనీర్లే కాకుండా వివిధ రకాల ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. ఆ రకంగా వీటిల్లోనూ ఉద్యోగావకాశాలు గణనీయంగా ఉన్నాయి‘ అని పాయ్ తెలిపారు. ఎంట్రీ లెవల్లో రూ.5 లక్షలు? ఐటీ సేవల సంస్థల్లో ఉద్యోగులు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ పొందుతుండటం రెట్టింపు స్థాయిలో జరుగుతోందని, ఐటీ కంపెనీల్లో డిజిటల్ విభాగాల ఆదాయాలు రెండంకెల స్థాయిలో వృద్ధి చెందుతోందని పాయ్ చెప్పారు. ‘‘ఫ్రెషర్స్ జీతభత్యాల ప్యాకేజీ చాలా కాలం తర్వాత 20 శాతం మేర పెరగడం మంచి పరిణామం. మరింత సుశిక్షితులైన నిపుణులను ఆకర్షించేందుకు కంపెనీలు మరింత ఎక్కువ జీతభత్యాలు ఆఫర్ చేస్తున్నాయి. దీంతో ఎంట్రీ లెవెల్ ప్యాకేజీలు ప్రస్తుతం వార్షికంగా రూ. 4.5–5 లక్షల దాకా ఉంటున్నాయి. నిజానికి చాలా కాలం పాటు ఎంట్రీ లెవెల్లో జీతాలు పెరగకుండా స్థిరంగా ఉండిపోయాయి. దీంతో ఉద్యోగులు నిరాశలో మునిగారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లతో పోలిస్తే పెద్ద నగరాల్లో డెలివరీ బాయ్స్ కూడా నెలకు రూ.50,000 సంపాదిస్తున్నారు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం‘ అని పాయ్ వ్యాఖ్యానించారు. -
‘కరువు జిల్లా సర్వతోముఖాభివృద్ధి’
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: దేశంలో అత్యంత వెనకబడిన ప్రాంతంగా ముద్రబడిన పాలమూరు ప్రాంతం సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు వెల్లడించారు. గతంలో ఎన్నడూలేని విధంగా తమ హయాంలో ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు. మంత్రి కేటీఆర్ మహబూబ్‌నగర్ అర్బన్ మండలం దివిటిపల్లి వద్ద ఐటీ అండ్ మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్‌కు శనివారం శంకుస్థాపన చేశారు. అలాగే మున్సిపాలిటీ పరిధిలో రూ.60 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి.. పెద్దచెరువు వద్ద నెక్లెస్‌రోడ్డు నిర్మాణానికి మరో రూ.24 కోట్లు మంజూరు చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఐటీ పార్కు స్థలంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో కేటీఆర్ మాట్లాడారు. ఐటీ పార్కు ఏర్పాటు పాలమూరు చరిత్రలో లిఖించదగిన రోజని పేర్కొన్నారు. ఐటీ పార్కు వల్ల ప్రత్యక్షంగా 15వేల మందికి పరోక్షంగా మరో 15వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఐటీ టవర్ నిర్మాణం కోసం వెంటనే రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే అభివృద్ధి నిరోధకంగా మారిన కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పేలా పాలమూరు ప్రజలు తమ పౌరుషాన్ని చూపించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో పాలమూరులోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరేలా చూడాలని కోరారు. రూ.74కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శని వారం పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మూడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పట్టణంలో రూ.30 కోట్లతో 41వార్డుల్లో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలకు సంబంధించి 215పనులను ఆర్అండ్బీ చౌర స్తాలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత పట్టణం లో వివిధ చౌరస్తాల్లో రూ.30కోట్లతో చేపట్టనున్న నూతన నిర్మాణాలను క్లాక్‌టవర్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి స్థానికంగా ఉన్న అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఆ తర్వాత పెద్ద చెరువును మంత్రి కేటీఆర్‌తో పాటు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వరరెడ్డి, గువ్వల బాలరాజు, కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పరిశీలించారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ పెద్ద చెరువులో బోట్ షికారు చేశారు. పెద్ద చెరువు చుట్టూ నెక్లెస్ రోడ్డు నిర్మాణంపై ఆరాతీసిన మంత్రి పనులకు రూ.24కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. భారీ బందోబస్తు జిల్లా కేంద్రంలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యాన భారీ బందో బస్తు నిర్వహించారు. అర్అండ్బీ అతిథిగృహం చౌరస్తా, క్లాక్‌టవర్, పెద్ద చెరువు ప్రాంతాల్లో ప్రత్యే క పోలీస్ బలగాలను మోహరించారు. పట్టణ డీఎస్పీ భాస్కర్ ఆధ్వర్యంలో ఎక్కడా ఇబ్బంది ఎదురుకాకుండా పర్యవేక్షించారు. కాగా, మంత్రి కేటీఆర్‌కు జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ తెలంగాణ ఎంప్లాయీస్ టీచర్స్, గెజిటెడ్ ఆఫీసర్స్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇచ్చారు. 30శాతం ఐఆర్‌ను వెంటనే ప్రకటించి, తెలంగాణ మొదటి పీఆర్సీ జూలై నుంచి అమలుచేయాలని కోరారు. సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ స్కీంను పునరుద్దరించడానికి అసెంబ్లీలో తీర్మా నించి కేంద్రానికి పంపాలని, జిల్లాలో వెల్నెస్ సెంటర్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణారావు, టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్ చౌరస్తాలో జంక్షన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రులు కేటీఆర్,లక్ష్మారెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్ -
మన నగరం కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్
-
టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెనీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) ఆధ్వర్యంలోని వైమానిక సెజ్‌లో టాటా బోయింగ్ ఏరోస్పేస్ కంపెని గురువారం ప్రారంభమైంది. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ అండ్ బోయింగ్ జాయింట్ వెంచర్ ఆధ్వర్యంలో ఆదిభట్లలో 14 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన ఈ కంపెనీని తెలంగాణా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, టాటా సన్స్ ఎమరిటీస్ ఛైర్మన్ రతన్ టాటా, అమెరికా రాయబారి కెన్నత్ జెస్టర్, ఎంపీలు కొండావిశ్వేశ్వర్‌రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. టాటా బోయింగ్ ఏరోస్పేస్ ఫెసిలిటీ సెంటర్లో హెలికాప్టర్లకు, ఎస్ ఆర్మీ యుద్ధ హెలికాప్టర్ల విడిభాగాలు ఇక్కడ తయారుకానున్నాయి. ముఖ్యంగా బోయింగ్ ఏహెచ్ 64 విమానాల విడిభాగాలకు తోడు అపాచీ హెలికాప్టర్లను కూడా తయారుచేయనున్నారు. తద్వారా 350 మందికి ఉపాధి అవకాశాలు లభించనుంది. కాగా విమాన విభాగాల తయారీ కేంద్రానికి 2016 జూన్ 18న అప్పటి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్, టాటా గ్రూపుల చైర్మన్ రతన్ టాటా, తెలంగాణ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, బోయింగ్ సంస్థలు కలిసి టాటా బోయింగ్ ఏరో స్పేస్ లిమిటెడ్ ఉమ్మడి సంస్థను ఏర్పాటు చేశాయి. -
మొత్తానికి కేటీఆర్ ఫిదా అయ్యాడు
సాక్షి, సినిమా : తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సినిమాల పట్ల ఆసక్తికనబరుస్తారన్న విషయం తెలిసిందే. సినీ సెలబ్రిటీలతో స్నేహపూర్వకంగా ఉండే ఆయన.. తరచూ సినిమాలు చూస్తూ తన అభిప్రాయాన్ని కూడా సోషల్ మీడియాలో తెలియజేస్తుంటారు. తాజాగా ఆయన తొలిప్రేమ చిత్రాన్ని చూసి ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ‘‘శనివారం రాత్రి అద్భుతంగా గడిచింది. తొలిప్రేమ లాంటి ఓ సున్నితమైన ప్రేమకథను చూశాను. దర్శకుడు వెంకీ అట్లూరి బాగా తెరకెక్కించాడు. రాశీ ఖన్నా, వరుణ్ తేజ్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. ముఖ్యంగా మంచి సాహిత్యం.. దానికి థమన్ టెర్రిఫిక్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి’’ అని కేటీఆర్ గత రాత్రి ట్వీట్ చేశారు. దీనికి స్పందించిన థమన్ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ రీట్వీట్ చేయగా.. గ్రేట్ జాబ్ అంటూ కేటీఆర్ మరో ట్వీట్‌తో అభినందన తెలియజేశారు. Saturday night well spent. Watched a sensitive love story in Telugu after a while ‘Tholi Prema’ is well directed by @dirvenky_atluri terrific music, lyrics & background score, fabulous cinematography & absolutely brilliant performances by @IAmVarunTej & @RaashiKhanna 👍👏 — KTR (@KTRTRS) 10 February 2018 Great Job Thaman 👍 BG & Music was outstanding and so were lyrics. My compliments https://t.co/q7tk5BmbSj — KTR (@KTRTRS) 11 February 2018 -
కేటీఆర్‌ను కలిసిన ఎంపీ కవిత
సాక్షి, హైదరాబాద్ : ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను నిజామాబాద్ ఎంపీ కవిత సోమవారం కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌లో ఐటీ పార్క్ ఏర్పాటు చర్చించారు. భేటీ అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ రూ.50 కోట్లతో నిజామాబాద్‌లో ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకూ 60 ఐటీ కంపెనీలు ముందుకు వచ్చాయని, వచ్చే దసరాకు ఐటీ పార్క్ ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. నిజామాబాద్ ఐటీ పార్క్‌తో ఉత్తర తెలంగాణకు మేలు చేకూరుతుందన్నారు. అలాగే పసుపు బోర్డు ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే ఉన్నామని కవిత పేర్కొన్నారు. Soon NZB will have an IT hub. Telangana Govt. has directed TSIIC to identify the land for the construction. @KTRTRS @TelanganaCMO pic.twitter.com/wWTchIVOSP — Kavitha Kalvakuntla (@RaoKavitha) 9 October 2017 -
హ్యాండీక్రాఫ్ట్స్‌కు మరింత ప్రాధాన్యం ఇస్తాం
-
కాంగ్రెస్‌కు అంత కంటగింపు ఎందుకు
-
ఆర్ట్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన కేటిఆర్
-
హైదరాబాద్‌లో యుటిసి ఆర్అండ్ డి సెంటర్
-
మంత్రి కేటీఆర్‌తో అమెరికా డెలిగెట్స్ భేటీ
-
అమెరికా పర్యటనలో తొలిరోజు కేటీఆర్ బిజీబిజీ
-
కేన్సర్ రోగులను పరామర్శించిన కేటీఆర్
-
'యువతకు ఉపయోగపడేలా మన టీవీ కార్యక్రమాలు'
- ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ హైదరాబాద్: ప్రభుత్వం నడిపిస్తున్న 'మన టీవీ' ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువకులకు ఉపయోగపడే కార్యక్రమాలు రూపొందించాలని అధికారులను ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రైతులకు, గృహిణులకు ఉపయుక్తంగా ఉండేలా కార్యక్రమాలుండాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం మంత్రి ప్రకటన విడుదల చేశారు. పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తున్న మనటీవీకి కొత్త పేరు, లోగోను సూచించాలని సీఈఓ శైలేష్‌రెడ్డి కోరారు. మంచి పేరు, లోగో సూచించిన వారికి రూ.51 వేల బహుమతి అందిస్తామని ప్రకటించారు. పేరు, లోగోలను ఐటీ శాఖ వెట్సైట్లో లేదా అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ప్రాంగణంలోని మనటీవీ కార్యాలయంలో నేరుగా కానీ, పోస్టు ద్వారా కానీ సమర్పించవచ్చని తెలిపారు. -
దేశానికే తలమానికం
‘టాటా-బోయింగ్ ఏరోస్పేస్’ యూనిట్‌పై రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ఆదిబట్లలో వైమానిక విడిభాగాల తయారీ సంస్థకు శంకుస్థాపన రక్షణ రంగంలో దశల వారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తెలంగాణ ప్రభుత్వ విధానాలు బాగున్నాయని ప్రశంస ‘ఏరోస్పేస్’ యూనిట్‌తో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం పెట్టుబడులకు రాష్ట్రం ఆకర్షణీయ గమ్యస్థానంగా మారింది: కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: దేశ వైమానిక రంగానికి ‘టాటా-బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్’ తలమానికంగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ పేర్కొన్నారు. దేశ రక్షణ రంగంలో దశల వారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రవేశపెడుతున్నామని.. ఏరోస్పేస్ యూనిట్‌తో దానికి తొలి అడుగు పడుతోందని చెప్పారు. సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.200 కోట్లతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్‌ను మూడు నెలల్లో పూర్తిచేసి విడిభాగాల ఉత్పత్తి ప్రారంభించేలా టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ చర్యలు చేపడుతోందన్నారు. శనివారం హైదరాబాద్ శివార్లలోని ఆదిబట్లలో ఉన్న టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్) ప్రాంగణంలో ‘టాటా-బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్’ యూనిట్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్ల ప్రధాన భాగాలను తయారు చేయడానికి బోయింగ్, టీఎఎస్ఎల్ల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిందని పరీకర్ చెప్పారు. రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దశల వారీగా ప్రవేశపెడుతున్నామని... టాటా బోయింగ్ యూనిట్‌తో ఈ ప్రక్రియకు తొలి అడుగు పడినట్లయిందని పేర్కొన్నారు. దీనితో ప్రపంచవ్యాప్తంగా అపాచీ హెలికాప్టర్లకు విడిభాగాలను అందించే 15 దేశాల్లో భారత్ ఒకటిగా నిలవనుందని వెల్లడించారు. విదేశీ పెట్టుబడుల విషయంలో కేంద్రం సరళీకృత విధానాలను అవలంబిస్తోం దని..ఆ విధానాలకు న్యాయశాఖ ఆమోదం లభించిందని చెప్పారు. రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులపై సహజంగానే ఏదో ఒక చర్చ జరుగుతుందని.. భారత మీడియాకు సృజనాత్మకత (క్రియేటివిటీ) ఎక్కువగా ఉండడం వల్లే ఇలా జరుగుతోందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రం చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం ఫలితాలు త్వరలోనే చూడబోతున్నామని పేర్కొన్నారు. టీఎస్ఐపాస్, ఐటీ పాలసీ భేష్.. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్, ఐటీ పాలసీలు బాగున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి పరీకర్ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆలోచనలకు అనుగుణంగా ఆకర్షణీయ పాలసీలను ప్రకటి స్తుంటాయని, అవన్నీ ఆచరణలో విజయవంతం కావని పేర్కొన్నారు. కానీ తెలంగాణ ప్రకటించిన విధానాలు పెట్టుబడులను ఆకర్షించేవిగా ఉన్నాయని.. తెలంగాణకు వస్తున్న పెట్టుబడులు చూస్తే అవి విజయవంతమైనట్లు స్పష్టమవుతోందని అభినందించారు. పెట్టుబడుల విషయంలో స్పష్టమైన విధానాలు అవసరమని, ఆ దిశగా తెలంగాణ ముందుకు సాగుతోందని కితాబిచ్చారు. టీ-హబ్‌పై ప్రశంసల జల్లు సార్టప్‌లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీ-హబ్‌పై పరీకర్ ప్రశంసల జల్లు కురిపించారు. శనివారం టీ-హబ్‌ను సంద ర్శించిన కేంద్రమంత్రికి మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. టీ-హబ్‌లోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలనుద్దేశించి పరీకర్ మాట్లాడారు. కేటీఆర్ టీ-హబ్‌కు రూపకల్పన చేయడం ఆయన నాయకత్వ ప్రతిభకు అద్దం పడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ కలలు కంటారని, ఆ కలలను నిజం చేసుకునేందుకు పనిచేసేవారు తక్కువగా ఉంటారని... కేటీఆర్ బృం దంలో పనిచేసే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని అభినందించారు. టెక్నాలజీ ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయని, ఆ మేరకు టెక్నాలజీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో క్లీన్టెక్, శానిటేషన్ రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని, ఆ దిశగా కృషి చేయాలని స్టార్టప్‌లకు పరీకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, టీ-హబ్ సీఈవో క్రిష్ణన్ తదితరులు పాల్గొన్నారు. విశ్వవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతి: కేటీఆర్ టాటా-బోయింగ్ వైమానిక విడిభాగాల ఉత్పత్తి సంస్థ రాష్ట్రానికి రావడం సంతోషకరమని... దీనితో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని మం త్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయ గమ్యంగా మారినందునే అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేం దుకు ముందుకు వస్తున్నాయన్నారు. టీఎస్ఐపాస్ ద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని, గత 10నెలల్లో 2,130 పరిశ్రమలకు అనుమతులివ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్ ఎస్.రమదొరై, సీఈవో సుకరాన్సింగ్, ఏరోస్ట్రక్చర్స్ హెడ్ మసూద్ హుస్సేనీ, బోయింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రత్యూష్ కుమార్, బోయింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ దేవ్ కూపర్స్మిత్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు పాల్గొన్నారు. -
సిఎం అఖిలేష్‌తో భేటీ కానున్న కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పంచాయితీ శాఖ మంత్రి కేటీఆర్, అధికారుల బృందం గురువారం ఉదయం లక్నో బయలుదేరి వెళ్లారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో కేటీఆర్ బృందం భేటీ కానున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులపై యూపీ సిఎం ఆసక్తి కనిబరిచారు. దీంతో అఖిలేష్ ఆహ్వానం మేరకు ప్రాజెక్టు వివరాలను కేటీఆర్ బృందం ఆయనకు తెలియజేయనున్నారు. ఈ భేటీలో పలు రాజకీయ అంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. కేటీఆర్‌తో పాటు అధికారులు రేమండ్ పీటర్, సురేందర్ రెడ్డి లక్నో వెళ్లారు. -
రూ.15వేల కోట్లతో రోడ్ల నిర్మాణం
నిజాంసాగర్ (నిజామాబాద్ జిల్లా) : రాష్ట్రంలో రూ.15వేల కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడతామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని వెల్లనూరు, మంగునూరు, నర్సింగపల్లి గ్రామంలో రూ. 4 కోట్లతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 15వేల కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే తదితరులు పాల్గొన్నారు. -
నూతన ఆవిష్కరణలకు సిద్ధం కావాలి
డీకోడ్ ఐటీ పార్క్ ప్రారంభసభలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆదిబట్ల: యువత నూతన ఆవిష్కరణలకు సిద్ధం కావాలని.. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ముందుకెళ్లాలని ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పేర్కొన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 3వ అంతర్జాతీయ కాన్ఫరెన్స్‌లో భాగంగా డీకోడ్ (డిజిటల్ ఇంజనీరింగ్ సెంటర్ ఫర్ ఆఫ్‌షోర్ అండ్ డొమెస్టిక్ ఎంటర్ప్రైజెస్) ఐటీ పార్క్‌ను మంత్రి మహేందర్‌రెడ్డి, భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలతో కలసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థులు నూతన ఆవిష్కరణలు కనుగొనడానికి ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. దేశంలోనే మొదటిసారిగా ఇక్కడ డీకోడ్ ఐటీ పార్క్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లాలో మహేశ్వరంలో మైక్రోమ్యాక్స్, మేడ్చల్‌లో సెల్కాన్, థామ్సన్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని వివరించారు. జిల్లాలో 7 హార్డ్‌వేర్ పార్కులు ఏర్పాటవుతున్నాయని, గ్రామాల్లో 70 శాతం బ్రాడ్‌బ్యాండ్ సేవలను విస్తరిస్తున్నామని మంత్రి తెలిపారు. దేశంలో 125 కోట్ల జనాభా ఉన్నప్పటికీ.. విదేశీయులు కనుగొన్న వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలను వాడుతున్నామని చెప్పారు. దేశ జనాభాలో సగం మంది ఉన్న యువత కొత్త అంశాలను వెలికితీయాలని పిలుపునిచ్చారు. రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఇంజనీరింగ్ కళాశాలలున్న రంగారెడ్డి జిల్లాలో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, జేఎన్టీయూ వైస్ చాన్సలర్ కిషన్‌కుమార్‌రెడ్డి, గురునానక్ కళాశాల చైర్మన్ కోహ్లీ, నగర పంచాయతీ చైర్మన్ భరత్‌కుమార్, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామల వెంకట్‌రెడ్డి, ఈసీ శేఖర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
శభాష్ కలెక్టర్ !
- హరితహారం కార్యాచరణ భేష్ - కలెక్టర్ కరుణను అభినందించిన మంత్రి కేటీఆర్ హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కలెక్టర్ వాకాటి కరుణనుయ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో హరితహారం, పుష్కర పనులు, ఇతర గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై సమీక్ష నిర్వహించారు. అటవీశాఖ మంత్రి జోగురామన్న, గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి రేమండ్ పీటర్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జిల్లాలో 10 వేల ఎకరాల పోడు భూముల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటించే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. రా ష్ట్రంలో ఇది ఒక రికార్డ్డుగా నిలిచిపోతుందని అభినందనలు తెలిపారు. కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ జిల్లాలో మొక్కలు నాటిన తర్వాత ర క్షణ కోసం ట్రీగార్డులు కొనుగోలు చేయుస్తున్నామని తెలిపారు. హరితహారం విజయవంతం కోసం గ్రామా ల్లో మహిళా సంఘాలు, వనసంరక్షణ సమితుల సహకారం తీసుకుంటామని తెలి పారు. గ్రామాలు, నర్సరీల వారిగా మొక్కల వివరా లు ఆన్లైన్లో ఉంచామని తెలిపారు. సమావేశంలో డీపీఓ ఈఎస్నాయక్, డీఎఫ్‌వోలు పాల్గొన్నారు.