నిజాంసాగర్ (నిజామాబాద్ జిల్లా) : రాష్ట్రంలో రూ.15వేల కోట్లతో రోడ్ల నిర్మాణం చేపడతామని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. గురువారం ఆయన నిజామాబాద్ జిల్లా నిజాంసాగర్ మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని వెల్లనూరు, మంగునూరు, నర్సింగపల్లి గ్రామంలో రూ. 4 కోట్లతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 15వేల కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే హన్మంత్ షిండే తదితరులు పాల్గొన్నారు.
రూ.15వేల కోట్లతో రోడ్ల నిర్మాణం
Published Thu, Aug 20 2015 4:38 PM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM
Advertisement