శభాష్ కలెక్టర్ !
- హరితహారం కార్యాచరణ భేష్
- కలెక్టర్ కరుణను అభినందించిన మంత్రి కేటీఆర్
హన్మకొండ అర్బన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం జిల్లాలో విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ చేపడుతున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కలెక్టర్ వాకాటి కరుణనుయ ఆయన ప్రత్యేకంగా అభినందించారు. శనివారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో హరితహారం, పుష్కర పనులు, ఇతర గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై సమీక్ష నిర్వహించారు.
అటవీశాఖ మంత్రి జోగురామన్న, గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి రేమండ్ పీటర్ పాల్గొన్న ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ జిల్లాలో 10 వేల ఎకరాల పోడు భూముల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటించే ప్రయత్నం చేయడం అభినందనీయమన్నారు. రా ష్ట్రంలో ఇది ఒక రికార్డ్డుగా నిలిచిపోతుందని అభినందనలు తెలిపారు. కలెక్టర్ వాకాటి కరుణ మాట్లాడుతూ జిల్లాలో మొక్కలు నాటిన తర్వాత ర క్షణ కోసం ట్రీగార్డులు కొనుగోలు చేయుస్తున్నామని తెలిపారు. హరితహారం విజయవంతం కోసం గ్రామా ల్లో మహిళా సంఘాలు, వనసంరక్షణ సమితుల సహకారం తీసుకుంటామని తెలి పారు. గ్రామాలు, నర్సరీల వారిగా మొక్కల వివరా లు ఆన్‌లైన్‌లో ఉంచామని తెలిపారు. సమావేశంలో డీపీఓ ఈఎస్‌నాయక్, డీఎఫ్‌వోలు పాల్గొన్నారు.