మా ఫ్యామిలీ గర్వపడేలా వరుణ్‌ నటించాడు | Tholi Prema Team Meets Mega Star Chiranjeevi | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 17 2018 9:01 AM | Last Updated on Fri, Mar 22 2024 11:25 AM

‘‘తమ్ముడు పవన్‌కల్యాణ్‌ నటించిన హిట్‌ చిత్రం ‘తొలిప్రేమ’. ఆ టైటిల్‌తో వరుణ్‌ చేసిన సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తితో ‘తొలిప్రేమ’ చూశా. పూర్తిగా సంతృప్తి చెందా. చాలా బాగా నచ్చింది. ఈ సినిమాని హ్యాండిల్‌ చేయడం అంత సులభం కాదు. డైరెక్టర్‌ వెంకీకి ఇది ఓ ఛాలెంజ్‌’’ అని నటుడు చిరంజీవి అన్నారు. వరుణ్‌తేజ్, రాశీఖన్నా జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ‘తొలిప్రేమ’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రబృందాన్ని చిరంజీవి తన స్వగృహంలో అభినందించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement