
సాక్షి, హైదరాబాద్: వరుణ్ తేజ్ తాజా చిత్రం ‘తొలిప్రేమ’ భారీ కలెక్షన్లు సాధించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఈ సినిమా దుమ్మురేపుతోంది. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొమ్మిది రోజుల్లో రూ. 38 కోట్ల గ్రాస్, రూ. 20.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. అమెరికాలో ఇప్పటివరకు రూ. 6.09 కోట్లు రాబట్టింది.
కొత్త దర్శకుడు వెంకీ అట్లూరి.. యూత్‌ఫుల్ లవ్‌స్టోరీతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తోంది. వరుణ్ తేజ్ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటించింది. సుహాసిని, నరేష్, ప్రియదర్శి, హైపర్ ఆది ముఖ్యపాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌లో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు.