రాశీఖన్నా
‘తొలిప్రేమ’... జీవితంలో ఫస్ట్ లవ్ లేనివాళ్లు ఉండరు. అది ఫెయిలైనా జీవితాంతం గుర్తుంటుంది. ఫస్ట్ లవ్ ఇంపాక్ట్ అలాంటిది. ఈ నెల 10న వరుణ్ తేజ్, రాశీఖన్నా జంటగా నటించిన ‘తొలిప్రేమ’ రిలీజవుతుంది. ఈ చిత్రం అందరి మనసులపై మంచి ప్రభావం చూపిస్తుందంటున్నారు రాశీ ఖన్నా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీయస్‌యన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ సందర్భంగా రాశీఖన్నా పలు విశేషాలు పంచుకున్నారు.
► ఈ సినిమా ఒప్పుకున్నాక నేను పవన్ కల్యాణ్ గారి తొలిప్రేమ (1998) సినిమాను కావాలనే చూశాను. అందులో హీరోయిన్ కీర్తీరెడ్డి ఇంట్రడక్షన్ హైౖలట్‌గా ఉంటుంది. నా ఇంట్రడక్షన్‌కి దానికి సంబంధం లేదు. నా సినిమాల్లో నా బెస్ట్ ఇంట్రడక్షన్ అంటే ‘జిల్’లో బావుంటుంది.
► నా తొలి ప్రేమ విషయానికొస్తే నా కాలేజీలో సీనియర్‌తో 17 ఏళ్ల వయస్సులోనే ఫస్ట్ క్రష్ జరిగింది. అతనే ప్రపోజ్ చేశాడు (నవ్వుతూ).
► ఈ సినిమాలో నా పేరు వర్ష. మూడు డిఫరెంట్ క్యారెక్టర్స్‌లో కనిపిస్తా. ఒకటి∙19 ఏళ్ల కాలేజీ యువతిలా. మరోటి లండన్ గర్ల్. ఇంకో పాత్ర నా ఏజ్‌కి తగ్గట్టుగా ఉంటుంది. మూడు పాత్రలను చాలా ఎంజాయ్ చేశాను.
► కాలేజి గర్ల్ పాత్ర కోసం రెండు నెలలు వర్కవుట్ చేసి ఐదు కిలోలు తగ్గాను. తగ్గటం కోసం తిండి మానేయలేదు. ఫుల్‌గా తిని, జిమ్‌లో వర్కవుట్ చేశాను. రోజూ కనీసం రెండు గంటలైనా జిమ్‌లో గడిపాను. ఇప్పుడు అందరూ తగ్గావంటే చాలా ఆనందంగా ఉంది.
► వరుణ్ తేజ్ మంచి కోస్టార్. ఈ సినిమాలోని పాత్ర కోసం చాలా ఎక్సర్‌సైజ్ చేశాడు. జనరల్‌గా రోజుకి ఒక్కసారి జిమ్‌కి వెళ్లడం చాలా కష్టం. అటువంటిది రోజు మూడు సార్లు జిమ్ చేసేవాడు. ఈ సినిమాలో కారులో రొమాన్స్ జరిగే సీన్ బెస్ట్ సీన్.
► వెంకీకి ఈ కథ తయారుచేసుకోవటానికి రెండున్నరేళ్లు పట్టింది. కథను ఎంత బాగా రాశాడో అంతకంటే బాగా తీశాడు.
► ఈ ఏడాది తమిళంలో నావి మూడు సినిమాలు రిలీజవుతాయి. ఒకటి అథర్వ, ఇంకోటి ‘జయం’ రవి, మరోటి సిద్ధార్ధ్ పక్కన చేస్తున్న సినిమాలు. వీటిలో ఓ సినిమాలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీ రోల్ చేస్తున్నారు. ఆయ వెరీ డౌన్ టు ఎర్త్. ప్రస్తుతం సౌత్‌లో హ్యాపీగా ఉన్నాను. హిందీకి వెళ్లే ఐడియా లేదు. ఒకవేళ మంచి చాన్స్ వస్తే.. అప్పుడు ఆలోచిస్తా.
Comments
Please login to add a commentAdd a comment