
పెళ్లికి ముందు సంగీత్‌లో సూపర్‌గా డ్యాన్స్ చేస్తున్నారు అఖిల్. మరి.. ఎవరి పెళ్లి అనేది ఈ నెల 25న థియేటర్స్‌లో తెలుస్తుంది. అఖిల్ హీరోగా ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘మిస్టర్ మజ్ను’. ఇందులో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ విదేశాల్లో జరుగుతోందని సమాచారం. ‘‘సంగీత్ సెలబ్రేషన్స్‌లో డ్యాన్స్ మొదలైంది. ఇంకా రెండు రోజులు సాగుతుందీ డ్యాన్స్’’ అని పేర్కొన్నారు అఖిల్. ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేయాలనుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment