‘నాకు అలా లవ్‌ చేయడం చేతకాదు’ | Akhil Akkineni Mr Majnu Trailer Released | Sakshi
Sakshi News home page

Published Sat, Jan 19 2019 9:36 PM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

Akhil Akkineni Mr Majnu Trailer Released - Sakshi

చేసిన రెండు సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా.. ముచ్చటగా మూడోసారి తన లక్‌ను పరీక్షించుకునేందుకు సిద్దమయ్యాడు అక్కినేని వారసుడు అఖిల్‌. తొలిప్రేమతో హిట్‌ కొట్టిన వెంకీ అట్లూరితో కలిసి ‘మిస్టర్‌ మజ్ను’గా పలకరించేందుకు అఖిల్‌ సిద్దమయ్యాడు. ఇప్పటికే ఈ మూవీ టీజర్‌, సాంగ్స్‌తో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 

నేడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అతిథిగా విచ్చేసిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. తొలిప్రేమను డిఫరెంట్‌గా తెరకెక్కించిన దర్శకుడు ఈ చిత్రాన్ని కూడా కొత్త తరహాలో రూపొందించినట్టు కనిపిస్తోంది. కథ పరంగా కొత్తదనం కనబడకపోయినా.. కథనంలో మాత్రం డైరెక్టర్‌ మార్క్‌ కనపడుతోంది. ట్రైలర్‌లో అఖిల్‌ చెప్పిన డైలాగ్‌లు బాగున్నాయి. ‘ నా కోసం ఎవరైనా ఏడిస్తే అది నా తప్పు కాదు. కానీ.. నావల్ల ఒక్కరు ఏడ్చినా అది కచ్చితంగా నా తప్పు అవుతుంది’ , ‘ఇప్పుడు లవ్‌ అంటే.. ముందు కొంచెం లవ్‌చేసుకుని, ఆ తర్వాత ఇంకొంచెం ఎక్కువగా లవ్‌చేసుకుని.. లాస్ట్‌లో పెళ్లి చేసుకుంటారు ఆ టైప్‌ లవ్వా.. నాకు అలా లవ్‌ చేయడం చేతకాదు’ అనే డైలాగ్‌లు హైలెట్‌ అయ్యాయి. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం జనవరి 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement