‘దేన్నైతే మిస్‌ చేయకూడదో.. దాన్నే మిస్‌ అన్నారు’ | Akhil Akkineni Venky Atluri Mr Majnu First Look | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 19 2018 4:18 PM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

Akhil Akkineni Venky Atluri Mr Majnu First Look - Sakshi

అక్కినేని నటవారసుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న మూడో సినిమా టైటిల్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. చాలా రోజులుగా ప్రచారం జరుగుతున్నట్టుగా మిస్టర్‌ మజ్ను అనే టైటిల్‌నే ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాలో అఖిల్‌ ప్లేబాయ్‌గా కనిపించనున్నాడు. తొలిప్రేమ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

రేపు (గురువారం) అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అఖిల్ కొత్త సినిమా టైటిల్‌తో పాటు టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీయస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్‌ సంగీతమందిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement