సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘మజ్ను’ | Akhil Akkineni Mr Majnu Censor Completed | Sakshi
Sakshi News home page

Published Mon, Jan 21 2019 7:44 PM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

Akhil Akkineni Mr Majnu Censor Completed - Sakshi

అఖిల్‌, హలో చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా..మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు అఖిల్‌ అక్కినేని. మిస్టర్‌ మజ్ను అంటూ అభిమానులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. తొలిప్రేమ లాంటి కూల్‌ హిట్‌ ఇచ్చిన వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో రాబోతోన్న ఈ మూవీపై మంచి అంచనాలే ఉన్నాయి. 

తాజాగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఈ ట్రైలర్‌ ట్రెండింగ్‌లో ఉంది. తాజాగా ఈ మూవీ సెన్సార్‌ పూర్తి చేసుకుంది. ఒక్క కట్‌ లేకుండా ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ లభించిందని యూనిట్‌ తెలిపింది. నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీ జనవరి 25న ప్రేక్షకుల ముందుకురానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement